ఓటుకు కోట్లు కేసులో కొనసాగుతోన్న విచారణ

19 Feb, 2019 18:07 IST|Sakshi

హైదరాబాద్‌: ఓటుకు కోట్లు కేసులో  ఏ-1గా  ఉన్న రేవంత్‌ రెడ్డిని ఈడీ అధికారులు ఆరు గంటలుగా విచారిస్తున్నారు. మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ రేవంత్‌ రెడ్డిని ఆరా తీస్తున్న సంగతి తెల్సిందే. స్టీఫెన్‌సన్‌కు ఇవ్వజూపిన రూ.50 లక్షలతో పాటు ఇస్తామన్న రూ. 4.5 కోట్లపై ఈడీ ఆరా తీస్తోంది. బ్యాంక్‌ స్టేట్‌మెంట్స్‌, ఏసీబీ ఇచ్చిన ఆధారాలు ముందు ఉంచి ఈడీ విచారిస్తోంది.

ఏసీబీ చార్జ్‌షీట్‌ ఆధారంగా నిందితులు అందరినీ ఈడీ విచారిస్తోంది. డాక్యుమెంట్స్‌ ఉన్న కారణంగా వాటిని వేరిఫై చేసుకోవడానికి ఈడీ అధికారులు సమయం ఎక్కువగా తీసుకుంటున్నారు. ఈడీ జేడీ, డైరెక్టర్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నేతృత్వంలో విచారణ సాగుతోంది. రేవంత్‌ విచారణ సమయంలో ఐటీ, ఏసీబీ అధికారులు ఈడీ కార్యాలయానికి రావాలని ఈడీ అధికారులు కోరారు. గతంలోనే ఓటుకు నోటు కేసులో ఏసీబీ చార్జిషీటు దాఖలు చేసింది. కొద్ది రోజుల క్రితమే ఐటీ అధికారులు రేవంత్‌ను విచారించారు. రేవంత్‌ను విచారించే సమయంలో చార్టెడ్‌ అకౌంటెంట్లు అందుబాటులో ఉన్నట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు