మరి కొద్ది గంటల్లో పెళ్లి అనగా..?

19 Feb, 2018 12:50 IST|Sakshi
నరేశ్‌పాల్‌ గాంగ్వర్‌ (ఫైల్‌)

ఫోన్‌లో లీనమై వెళ్తుండగా ఢీ కొట్టిన రైలు

ప్రాణాలు కోల్పోయిన ఓ సివిల్‌ ఇంజనీర్‌

లక్నో : మరి కొద్ది గంటల్లో పెళ్లి పీటలెక్కాల్సిన ఓ యువ ఇంజనీర్‌ ఆజాగ్రత్తగా వ్యవహరించి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో భాజభజాంత్రిలు మోగాల్సిన ఇంట్లో చావు డప్పు మోగింది. ఈ విషాద సంఘటన ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు సమీపంలోని నందోసి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నరేశ్‌పాల్‌ గాంగ్వర్‌ ఓ ప్రైయివేట్‌ బిల్డర్స్‌ కంపెనీలో సివిల్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. అతనికి అదే రోజు సాయంత్రం షాజహాన్‌పూర్‌కు చెందిన ఓ యువతితో పెళ్లి జరగాల్సింది. పెళ్లి పనులతో ఆ కుటుంబమంతా సందడి నెలకొంది. ఇంతలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నరేశ్‌పాల్‌కు ఫోన్‌ రావడంతో మాట్లాడుతూ.. తన ఇంటికి సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్‌ వద్దకు వెళ్లాడు. ఫోన్‌ ద్యాసలో ఉన్న నరేశ్‌ను వేగంగా వచ్చిన రాజ్యారాణి ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పెళ్లి కోసం వచ్చి అంత్యక్రియల్లో పాల్గొనడం బాధాకరంగా ఉందని అతని బంధు మిత్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు