ర్యాన్‌బాక్సీ మాజీ ఛైర్మన్‌ అరెస్ట్‌

11 Oct, 2019 11:03 IST|Sakshi

ఇప్పటికే తమ్ముడు శివిందర్‌ అరెస్ట్‌

రూ. 2,397 కోట్ల మేర నిధుల దుర్వినియోగం ఆరోపణలు


సాక్షి, న్యూఢిల్లీ: రెలిగేర్‌ మాజీ   ప్రమోటర్‌, ర్యాన్‌బాక్సీ మాజీ ఛైర్మన్‌, సింగ్‌ సోదరుల్లో ఒకరైన్‌ మల్విందర్‌  మోహన్‌ సింగ్‌ కూడా అరెస్ట్‌ అయ్యారు. ఇప్పటికే లుక్‌ అవుట్‌ నోటీస్‌ జారీ చేయగా, ఢిల్లీకి చెందిన ఆర్థిక నేరాల విభాగం అధికారులు లుధియానాలో గురువారం రాత్రి ఆయనను అరెస్ట్‌ చేశారు. ట్రాన్సిట్ రిమాండ్‌పై  మల్విందర్‌ను ఢిల్లీకి తరలించనున్నారు. 

రెలిగేర్‌ ఫిన్‌వెస్ట్‌ (ఆర్‌ఎఫ్‌ఎల్‌)కి చెందిన రూ. 2,397 కోట్ల మేర నిధులను దుర్వినియోగం చేసిన ఆరోపణలపై ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ మాజీ ప్రమోటర్‌, మల్విందర్‌ తమ్ముడు, శివీందర్‌ సింగ్‌తో పాటు మరో ముగ్గురిని ఢిల్లీ పోలీసులు గురువారం సాయంత్రం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.  రెలిగేర్ ఫిన్‌వెస్ట్‌కు చెందిన మన్‌ప్రీత్ సింగ్ సూరి దాఖలు చేసిన ఫండ్ డైవర్షన్‌ ఫిర్యాదు నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అరెస్టయిన వారిలో రెలిగేర్‌(ఆర్‌ఈఎల్‌) మాజీ చైర్మన్‌ సునీల్‌ గోధ్వానీ (58), ఆర్‌ఈఎల్‌, ఆర్‌ఎఫ్‌ఎల్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన కవి అరోరా, అనిల్‌ సక్సేనా ఉన్నారు. నిధులను మళ్లించి ఇతర సంస్థల్లో ఇన్వెస్ట్‌ చేశారన్న ఆరోపణలపై ఢిల్లీ పోలీస్‌ ఆర్థిక నేరాల విభాగం వీరిని అరెస్ట్‌ చేసినట్లు అధికారులు వెల్లడించారు నిందితులందరినీ ఈ సాయంత్రం ఢిల్లీలోని సాకేత్ కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత వారిని ప్రశ్నించడం కోసం అదుపులోకి తీసుకుంటారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ విషయంలో కేసు నమోదు చేసే అవకాశం ఉంది.

చదవండి : ఫోర్టిస్‌ మాజీ ప్రమోటర్‌ శివీందర్‌ అరెస్ట్‌!

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అత్తారింటికి వెళ్లి.. హత్యకు గురయ్యాడు

నాకు న్యాయం చేయండి

ముగ్గురు విద్యార్థులు అదృశ్యం

బాలుడి గొంతు కోసిన యువకుడు

ఏసీబీ వలలో అవినీతి చేప

బాలుడిని మింగేసిన కాలువ

ప్రేమించిందని కుమార్తె హత్యకు కుట్ర

ఫోర్టిస్‌ మాజీ ప్రమోటర్‌ శివీందర్‌ అరెస్ట్‌!

కొడుకును చంపి పూడ్చిపెట్టిన తండ్రి

పిడుగుపాటు: తెలుగు రాష్ట్రాల్లో విషాదం

రోడ్డుపై గుంత.. వైద్యురాలి మృతి

జర్నలిస్ట్‌ గొంతుకోసి కిరాతకంగా..

అదృశ్యమైన వృద్ధురాలు.. విగత జీవిగా..

తల్లిదండ్రులు, చిన్నారి పాశవిక హత్య

హిప్నటైజ్‌ చేసి.. ఆపై అత్యాచారయత్నం

బెడిసికొట్టిన తమిళ స్మగ్లర్ల వ్యూహం

ఆమెది హత్య ? ఆత్మహత్య ?

లాడ్జిలో యువతీయువకుల ఆత్మహత్య

ప్రియురాలి వివాహాన్ని జీర్ణించుకోలేక..

హత్య పథకం భగ్నం

గుప్త నిధుల పేరుతో మోసం

మృత్యువులోనూ వీడని స్నేహం

‘మామా.. నేను ఆత్మహత్య చేసుకుంటున్నా..’

మైనర్లపై కొనసాగుతున్న లైంగిక దాడులు

పరిధి పరేషాన్‌

జైల్లో ఇవేమిటి?

ప్రీతి మరణానికి కారణం తల్లా ప్రియుడా..?

ఉన్మాది పిన్ని

కారులో యువజంట మృతదేహాలు..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌: ‘మొగుడే ఎక్కువ రియాక్ట్‌ అవుతున్నాడు’

మనస్ఫూర్తిగా సోమరాజు వీలునామా!

టిక్‌టాక్‌ హీరో.. ఫాలో అవుతున్న తెలుగు సినీ స్టార్స్‌

సాఫ్ట్‌వేర్‌ సత్యభామ

బిగ్‌బాస్‌లో సరికొత్త ఆకర్షణ..

సైరాలాంటి సినిమాలు ఇంకా రావాలి