ఈఎస్ఐ స్కాం: వెలుగులోకి మరో అంశం

31 Oct, 2019 12:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈఎస్‌ఐలోని ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (ఐఎంఎఫ్‌) కుంభకోణం ​కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తులు జరుపుతున్న విషయం విదితమే. కాగా ఈ కేసులో ఐఎంఎఫ్‌ డైరెక్టర్‌ దేవికా రాణితో పాటు పలువురిని అరెస్టు చేసి దర్యాప్తు చేయగా.. రోజూరోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కుంభకోణంలో లో ఏసీబీ అధికారులు దర్యాప్తును వేగవంతం చేయడంతో డైరెక్టర్‌ దేవికా రాణి డొల్ల కంపెనీల వ్యవహరం వెలుగులోకి వచ్చింది.

తేజ ఫార్మా కంపెనీతో రాజేశ్వర్‌ రెడ్డి తమ్ముడు శ్రీనివాస్‌రెడ్డి పేరిట రెండు షెల్‌ కంపెనీలను నడుపుతున్నట్లు తెలిసింది. ఈ కంపెనీల పేరిట దేవికా రాణి, నాగలక్ష్మిలు కోట్ల రూపాయలను దండుకున్నట్లు అధికారులు తెలిపారు. డొల్ల కంపెనీల పేరిట నొక్కేసిన డబ్బుతో దేవికా రాణి రూ.3 కోట్లు విలువ చేసే బంగారం కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రస్తుతం అల్వాల్‌లోని శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లొ, కార్యాలయాల్లో సోదాలు కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

(చదవండి: హెచ్‌ఐవీ, డయాబెటిస్‌ కిట్లలో చేతివాటం)

మరిన్ని వార్తలు