‘ఎవడ్రా హీరో’ సినిమా హీరో అరెస్ట్‌

15 Dec, 2019 18:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘ఎవడ్రా హీరో’ చిత్రంలోని కథానాయకుడు బషీద్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రుణాలు ఇప్పిస్తానంటూ మోసాలకు పాల్పడినట్టు ఫిర్యాదులు అందడంతో హైదరాబాద్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బషీద్ ను అరెస్ట్ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల నుంచి రుణాల పేరుతో డబ్బు వసూలు చేసినట్టు అతడిపై ఆరోపణలు వచ్చాయి. ఒక్కొక్కరి వద్ద రూ.30 లక్షల నుంచి కోటి రూపాయల వరకు వసూలు చేసినట్టు తెలుస్తోంది. దుబాయ్‌లోని ఎస్‌బీకే గ్రూప్‌ పేరుతో బషీద్‌ నకిలీ వ్యాపారం చేసినట్లు ఆరోపణనలు ఉన్నాయి. దుబాయ్‌ ఎంబసీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బషీద్‌పై వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. 

షేక్‌ బషీద్‌ (42) వ్యాపారి. జూబ్లీహిల్స్‌ రోడ్‌నెంబరు 26లోని ప్లాట్‌ నెంబరు 304లో ఉంటున్నాడు. గుంటూరు జిల్లాకు చెందిన ఇతడు సినిమాపై మోజుతో చదువు మధ్యలోనే ఆపాడు. సినీ విభాగాల్లో శిక్షణ పొంది హైదరాబాద్‌ చేరాడు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. అల్లరే అల్లరి, మెంటల్‌పోలీస్‌, నోటుకు పోటు సినిమాలతో ఫిలింనగర్‌లో పాపులారిటీ సంపాదించాడు. గతంలో హీరో సందీప్‌ కిషన్‌తో వివాదానికి దిగాడు. సందీప్‌ కిషన్‌తో సినిమా తీయడం కంటే కుక్కను పెట్టి సినిమా నిర్మిస్తానని అనుచిత వ్యాఖ్యలు చేశాడు. తరచూ వివాదాల్లో నిలిచే బషీద్‌ అనేక మందిని మోసం చేసి అరెస్ట్‌ కావడం టాలీవుడ్‌లో సంచలనం కలిగిస్తోంది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మరో దిశ ఘటన : నిందితుడు అరెస్ట్‌

పెళ్లి జరిగిన రాత్రే షాకిచ్చిన వధువు

‘బిర్యానీ అమ్మాడని చితకబాదారు’

తాడేపల్లి పోలీసు స్టేషన్‌ వద్ద కలకలం

అబ్దుల్లాపూర్‌మెట్టులో అనూహ్య ఘటన!

అపరిచితుడి ఫోన్‌ కాల్‌..ఖాతా ఖాళీ

నవరంగపూర్‌ జిల్లాలో మరో ‘దిశ’

మద్యం మత్తులో దొరికిపోయి.. హల్‌చల్‌!

అమ్మ చేసిన పాపం శాపమైంది

ఒకే బైక్‌.. 71 కేసులు !

శ్రుతిమించిన కట్నం వేధింపులు

రూ. 1300కోట్ల విలువైన కొకైన్‌ స్వాధీనం

లైంగిక దాడి నిందితుడి అరెస్టు

రెండో భార్యతో కలిసి భర్త ఆత్మహత్య

‘పద్మశ్రీ’ లీలాశాంసన్‌పై సీబీఐ కేసు

అత్యాచారం.. ఆపై నిప్పు

'మద్యం మత్తులో మతిస్థిమితం లేని యువతిపై'

మావోల పేరుతో బెదిరింపులు

అన్నను అడ్డుకున్నా...తమ్ముడు వదలలేదు

సమతపై అత్యాచారం, హత్య: చార్జిషీట్‌ దాఖలు

భర్త మరణాన్ని తట్టుకోలేక దారుణం..!

సీఎం తమ్ముడి కిడ్నాప్‌; ఛేదించిన పోలీసులు

ఆ వ్యాపారిని పట్టిస్తే రూ. లక్ష బహుమతి

శరణప్ప హత‍్య కేసులో నలుగురి అరెస్ట్‌

దారుణం : తాగి వచ్చి సొంత కూతురుపైనే..

అశ్లీల చిత్రాల వీక్షణ: రాజకీయ నేతల విచారణ!

‘సల్మాన్‌ ఇంట్లో బాంబు.. దమ్ముంటే ఆపుకోండి’

ప్రియాంక గాంధీ సన్నిహితురాలికి సీబీఐ షాక్‌

‘నేను చచ్చిపోతా.. నా భర్తను కాపాడండి’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘ఎవడ్రా హీరో’ సినిమా హీరో అరెస్ట్‌

మహేష్‌ ఫ్యాన్స్‌కు మరో గుడ్‌ న్యూస్‌

కాలా చష్మా పాటతో అదరగొట్టిన కేథరిన్‌

సీఎం జగన్‌ మంచి నిర్ణయం తీసుకున్నారు : రాశి ఖన్నా

హాకీ స్టిక్‌ పట్టిన లావణ్య త్రిపాఠి

కమల్‌ హాసన్‌ను కలిసిన రాఘవ లారెన్స్‌