మారుతి మాజీ ఎండీకి షాక్‌

24 Dec, 2019 15:39 IST|Sakshi
మారుతి సుజుకి మాజీ ఎండీ జగదీష్ ఖట్టర్‌ (ఫైల్‌ ఫోటో​)

 పీఎన్‌బీలో రూ.110 కోట్ల స్కాం

మారుతి మాజీ ఎండీ జగదీష్  ఖట్టర్‌పై  సీబీఐ కేసు

సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో వెలుగు  చూసిన రూ.110 కోట్ల కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బ్యాంకు రుణం విషయంలో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగాలపై మారుతి   ఉద్యోగ్‌ లిమిటెడ్‌ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ జగదీష్ ఖట్టర్‌పై  కేసు నమోదు చేసింది. తన కొత్త కంపెనీ కార్నేషన్ ఆటో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ బ్యాంక్ లోన్ మోసం కేసులో 110 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని  తాజాగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో ఆరోపించింది. 

మారుతి ఎండీగా రిటైరైన తరువాత, జగదీష్ ఖట్టర్ కార్నేషన్ ఆటో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ను ప్రారంభించారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 2009లో 170 కోట్ల రూపాయల రుణాన్ని పొందారు. ఆ తర్వాత 2012 వరకు కొంత మొత్తాన్ని చెల్లించారు. కానీ సుమారు 110 కోట్ల రూపాయల రుణాన్ని ఎగ్గొట్టారు. దీంతో  2015లో ఇది నిరర్ధక ఆస్తి (ఎన్‌పిఎ)గా మారింది. దీనిపై బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది.
 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వీడిన వృద్ధురాలి హత్య మిస్టరీ

పొట్టకూటి కోసం వెళ్లి పరలోకాలకు..

మద్యం దొరక్క వెళ్లిపోయిన వారే అధికం

లాక్‌డౌన్‌: పోలీసును ఈడ్చుకెళ్లిన బైకర్‌

లాక్‌డౌన్‌ : బిలియనీర్ల విందు, ఉన్నతాధికారిపై వేటు

సినిమా

రష్మిక అంటే క్రష్‌ అంటున్న హీరో..

నిజంగానే గ‌డ్డి తిన్న స‌ల్మాన్‌

ముకేష్‌పై శత్రుఘ్న సిన్హా ఘాటు వ్యాఖ్యలు

'శ్రియా.. ప్లీజ్‌ అతన్ని ఇబ్బంది పెట్టకు'

‘నా భర్త దగ్గర ఆ రహస్యం దాచాను’

బన్నీపై కేరళ సీఎం ప్రశంసల వర్షం