మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

8 Nov, 2018 09:05 IST|Sakshi
కమలాదేవి (పాత చిత్రం)

కాకినాడ: కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గాదం కమలాదేవి(86)  గురువారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందారు. కమలాదేవి 1972లో జిల్లాలోని పామర్రు నియోజవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. కమలాదేవి గతంలో తూర్పుగోదావరి  జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు, టీటీడీ సభ్యురాలు గానూ, క్వాయర్ బోర్డ్ సభ్యురాలుగానూ విశేష సేవలందించారు.

కాకినాడ నగరంలో టీటీడీ కళ్యాణ మండపం నిర్మించడానికి తన వంతు సహాయం అందించారు. కమలాదేవికి రమేష్, మహేష్, హరీష్ అనే ముగ్గురు కుమారులు, అనురాధ అనే కుమార్తె ఉన్నారు. కమలాదేవి పీఏసీ చైర్మన్‌గా కూడా అప్పట్లో బాధ్యత నిర్వహించారు. కమల మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు