హుబ్లీ రైల్వే స్టేషన్‌లో పేలుడు

21 Oct, 2019 17:13 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

 ఒకరికి తీవ్ర గాయాలు

బెంగుళూరు: కర్ణాటకలోని హుబ్లీ రైల్వేస్టేషన్‌లో సోమవారం పేలుడు కలకలం సృష్టించింది. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగకున్నా.. పేలుడుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలిసిరాలేదు. పేలుడు ధాటికి గాయపడిన క్షతగాత్రుడిని దగ్గరలోని ఆస్పత్రికి స్థానికులు హుటాహుటిన తరలించారు. అకస్మాత్తుగా తక్కువ స్థాయిలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంతో రైల్వేస్టేషన్‌లోని జనాలకు ముచ్చెమటలు పట్టాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. గాయపడిన వ్యక్తిని హుసేన్‌ సాబ్‌ నాయక్‌వాలేగా పోలీసులు గుర్తించారు. అనుమానాస్పదంగా ఉన్న ఒక పెట్టెను తెరవడానికి ప్రయత్నించే సమయంలో ఈ పేలుడు సంభవించిందని, పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా