అదనపు కట్నపు వేధింపులు..మహిళ ఆత్మహత్య

20 Apr, 2018 08:41 IST|Sakshi
మృతురాలు విన్సీ జ్ఞాన సజని (ఫైల్‌)

బడంగ్‌పేట్‌/అఫ్జల్‌గంజ్‌ :  అదనపు కట్నంతోపాటు సూటిపోటి మాటలతో వేధిస్తుండటంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. అయితే తమ కూతురిది హత్యే అని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ సంఘటన జరిగింది. డైనమిక్‌ కాలనీకి చెందిన కైసర్‌ మితానియేల్, విజయ దంపతుల కూతురు విన్సీ జ్ఞాన సజనిని(28) కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన జాన్‌ విక్టర్‌కు ఇచ్చి గత ఏడాది ఆగష్టులో వివాహం జరిపించారు. పెళ్లిఅయిన కొత్తలో చెన్నైలో కొద్దికాలం కాపురం పెట్టారు. అక్కడి నుంచే అదనపు కట్నం వేధింపులు మొదలయ్యాయి. వివాహ సమయంలో మాట్లాడుకున్న కట్న కానుకల కోసం భర్త జాన్‌ ప్రతిరోజూ విన్సీని వేధించడం మొదలుపెట్టాడు. భర్త జాన్‌ తల్లితండ్రులు సంధ్య, విజయ్‌లతో పాటు ఆడపడుచు శిరీషాలు కలిసి విన్సీని ఆదనపు కట్నం తేవాలని ఫోన్‌లో  వేధించే వారు. దీంతో  మీర్‌పేటలోని తను ఉంటున్న ఇంటిని అమ్మాలని విన్సీ తల్లితండ్రులు నిర్ణయం తీసుకున్నారు.

ఈ క్రమంలోనే జాన్‌ విక్టర్‌ తల్లితండ్రులైన సంద్యా కృపానందంలతో కూతురు అల్లుడిని చెన్నై నుంచి హైదరాబాద్‌కు బుధవారం రప్పించారు. అల్మాస్‌గూడలో మరో ఇల్లు చూసేందుకు వెళ్లారు. ఆ సమయంలో విన్సీ ఇంటిలోనే ఉంది. కట్నం వేధింపులతోపాటు లేనిపోని నిందలు మోపుతుందడంతో తట్టుకోలేని విన్సీ  ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విన్సీని కట్నంకోసం తన బిడ్డను హింసించి  కొట్టి  చంపి ఉరివేశారని బాధితురాలి తండ్రి కైజర్‌ మీర్‌పేట పోలీసులకు పిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టంకై ఉస్మానియాకు తరలించారు. ఇదిలా ఉండగా మృతదేహంపై గాయాలుండటంతో తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. తాము బయటకువెళ్లగానే  భర్త విక్టర్‌ విన్సీపై దాడి చేసి చంపేశారని మృతురాలి తండ్రి ఆరోపిస్తున్నారు.

మరిన్ని వార్తలు