వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య

16 Jul, 2019 10:32 IST|Sakshi
హేమలత (ఫైల్‌)

అత్తింటివారే హత్య చేశారని కుటుంబసభ్యుల ఫిర్యాదు  

రాంగోపాల్‌పేట్‌: వరకట్న వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మార్కెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పార్శీగుట్టకు చెందిన శ్రావణ్‌కుమార్, జ్యోతి దంపతుల కుమార్తె హేమలత (23)కు ఆదయ్యనగర్‌కు చెందిన విజయలక్ష్మి, నర్సింగ్‌రావు దంపతుల కుమారుడు కిరణ్‌తో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది.  పెళ్లి సమయంలో రూ.4.5 లక్షల కట్నం, బంగారు నగలు ఇచ్చారు. వీరికి ఓ కుమార్తె. కిరణ్, హేమలత  ఆదయ్యనగర్‌లో నివసిస్తుండగా తల్లిదండ్రులు వేరుగా ఉంటున్నారు.  అయితే గత కొద్ది రోజులుగా అత్త, మామ, భర్త, ఆడపడుచు అదనపు కట్నం తేవాలని ఆమెను వేధిస్తున్నారు. వారి వేధింపులు తాళలేక హేమలత గత జనవరిలో షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలియడంతో కిరణ్‌ కేసు వాపసు తీసుకోకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో కేసు వెనక్కి తీసుకుంది. ఆ తర్వాత కూడా కిరణ్‌ అతడి కుటుంబ సభ్యులు తరచూ వేధింపులకు గురిచేస్తున్నారు.

కొద్ది రోజులుగా బైక్‌ కొనుక్కునేందుకు డబ్బు తీసుకు రావాలని ఒత్తిడి చేస్తుండటంతో సోమవారం ఉదయం ఆమె సోదరుడికి ఫోన్‌ చేసి విషయం చెప్పింది. తన భర్తకు మరో పెళ్లి చేస్తామని అత్త, మామ, ఆడపడుచు బెదిరిస్తున్నారని, పెద్ద మనుషులను పిలిపించి పంచాయితీ పెట్టించాలని కోరింది. అయితే మధ్యాహ్నం 12 గంటలకు ఆమె ఇంట్లో సీలింగ్‌ ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు హేమలత కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో ఆమె కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో  ఆదయ్యనగర్‌ చేరుకున్నారు. అత్తింటివారే ఆమెను హత్య చేశారని ఆరోపిస్తూ మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్నారు. హేమలత ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదన్నారు. పెళ్లికి ముందు ఉద్యోగం చేస్తున్నాడని రూ.25వేల జీతం వస్తుందని చెప్పి తమను మోసం చేశారని, అతను ఉద్యోగం లేకుండా ఆవారాగా తిరుగుతున్నాడని ఆరోపించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారికి నచ్చచెప్పి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సారా బట్టీలపై ఎక్సైజ్‌ అధికారుల దాడులు

బాలుడి కిడ్నాప్‌ కలకలం

కర్కశత్వానికి చిన్నారుల బలి

చాక్లెట్‌ అనుకుని ఎలుకల మందు తిని..

ప్రియుడితో కలిసి కన్న తల్లే కసాయిగా..

సీఎం పీఏ పేరుతో మోసానికి యత్నం

అందుకే చచ్చిపోవాలనిపించింది

ప్రాణాలు తీసిన స్టాపర్‌

ఆశలను ఆవిరి చేసిన అగ్నిప్రమాదం

ప్రాణం తీసిన బిందె

మద్యం తాగి కాక్‌పిట్లో ప్రయాణం

ఐదేళ్ల చిన్నారిపై కీచకపర్వం

స్కెచ్చేశాడు.. చంపించాడు

అక్కాచెల్లెల్ని బంధించి రెండు నెలలుగా..

సీఎం పీఏ అంటూ..డబ్బులు డిమాండ్‌

కాగ్నిజెంట్‌ ఉద్యోగి ఆత్మహత్య

బాలికను వేధించిన వాచ్‌మెన్‌కు దేహశుద్ధి

ప్రధాన సూత్రధారి కోగంటి సత్యమే...

రూ. 3.3 కోట్లు దోచేసి.. దర్జాగా..

ట్రిపుల్‌ మర్డర్: రక్తంతో శివుడికి అభిషేకం

తల ఛిద్రం; మోడల్‌ దారుణ హత్య

బాలుడి మృతి.. తల్లి పైనే అనుమానం...

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్‌

అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి

గిద్దలూరు వాసి చిత్తూరులో ఆత్మహత్య

వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య

పుట్టినరోజు వేడుకలకు వెళ్లిన యువతి..

అంత్యక్రియల అనంతరం నిలదీస్తే.. ఒప్పుకొన్న భర్త

తల్లి జబ్బుపడిందని.. కుమార్తె ఆత్మహత్య

సాక్షి భయపడినట్టే.. కోర్టు ఆవరణలోనే ఘటన

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

రత్నకుమారి వచ్చేశారు

వసూళ్లు పెరిగాయి

వసూళ్లు పెరిగాయి

యుద్ధానికి సిద్ధం