హైదరాబాద్‌లో దొంగ బాబా : యువతులకు డ్రగ్స్‌ ఇచ్చి..

28 Oct, 2018 21:49 IST|Sakshi

సాక్షి, మేడ్చల్‌ : తాము దైవాంశ సంభూతులమని చెప్పుకుంటూ మోసాలకు, లైంగిక దాడులకు పాల్పడుతున్న దొంగ బాబాల బండారం బయటపడుతున్నా ప్రజలు కళ్లు తెరవడం లేదు. దీంతో దొంగ బాబాల దురాగతాలకు అంతం లేకుండా పోతోంది. తాజాగా మేడ్చల్‌లో దొంగ బాబా వ్యవహారం బయటపడింది.

కీసర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గోదుమకుంట గ్రామంలో ఓమోజయ బాబా  తన ఆశ్రమంలోకి దూర ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి డ్రగ్స్‌ బానిసలుగా చేసి లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. యువతుల తల్లిదండ్రులు, హిందూ వాహినీ కార్యకార్తలు ఆందోళనకు దిగడంతో అసలు విషయం బయటపడింది.

మానసిక ప్రశాంత పేరుతో యువతులను అక్రమంగా నిర్భందించి డ్రగ్స్‌కు బానిసలుగా మారుస్తున్నారని  హిందూ వాహినీ కార్యకర్తలు ఆరోపించారు. గతంలో ఎన్నిసార్లు పోలీసులకు పిర్యాదు చేసిన పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నకిలీ బాబాల వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయని తెలిపారు. పోలీసులు చట్టరీత్య చర్యలు తీసుకోవాలని ఆశ్రమం ముందు ధర్నాకు దిగారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విద్యార్థినిని ప్రేమ పేరుతో..

కరోనా: హిట్‌ మ్యాన్‌ భారీ విరాళం!

పోలీసులు విచారణకు వెళ్తే..

కరోనా అంటూ కొట్టిచంపారు

పాపం మందుబాబు.. ఆరుసార్లు ఓటీపీ చెప్పి..

సినిమా

భార్య, పిల్లలు విదేశాల్లో చిక్కుకుపోయారు: విష్ణు

ఈ పాటను చేతులు కడుక్కొని వినండి!

ఇంటి ప‌ని చేస్తూ ఏడ్చేసిన‌ న‌టి

‘దారుణం, అత‌డి ప్ర‌తిభ‌ను కొట్టేశారు’

న‌యా ట్రెండ్ సృష్టిస్తోన్న ‘ఆహా’

సింగ‌ర్‌కు ఐదోసారీ క‌రోనా పాజిటివ్‌