ఘరానా మోసం

17 Feb, 2019 11:03 IST|Sakshi
దుండగులు అప్పగించిన  నకిలీ బంగారం

పర్వతగిరి: అతి ఆశ, అమాయకత్వం వారి గొప్ప ముంచింది. తక్కువ ధరకు బంగారం అందిస్తామన్న మోసగాళ్ల మాటలకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. నకిలీ బంగారం చేతిలో పెట్టి రూ.4లక్షల ఘరానా మోసానికి పాల్పడిన సంఘటన రూరల్‌ జిల్లా పర్వతగిరి మండలంలో ఇస్లావత్‌ తండాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు ధరంసోత్‌ హుక్యా తెలిపిన వవరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి తన ఫోన్‌ నంబర్‌ సేకరించి  తమ ఇంటి వద్ద పెద్ద ఎత్తున బంగారం ఉందని, తులానికి  రూ.20వేలకు అందిస్తామని మాయమాటలు చెప్పాడు. ఇది నమ్మిన హుక్యా బల్లారి వెళ్లి రూ.4లక్షలు చెల్లించి బంగారం తెచ్చుకున్నాడు. ఇంటికి వచ్చి చెక్‌ చేసే సరికి నకిలీ బంగారమని తెలియడంతో బాధిత కుటుంబ సభ్యులు లబోదిబోమంటున్నారు.
 
అలా మొదలైంది.. 
తండాకు చెందిన హుక్యా అన్నయ్య వెంకన్నకు తరచూ బంగారం ఉంది తక్కువ ధరకు ఇస్తామని దుండగులు ఫోన్‌ చేస్తున్నారు. రెక్కాడితే కాని డొక్కాడని వెంకన్న మేం కూలీ పనిచేసుకుంటాం మా వద్ద డబ్బులు లేవు అని చెప్పినప్పటికీ దుండగులు మళ్లీ మళ్లీ ఫోన్‌ చేసి ఇబ్బందిపెట్టారు.  పదే పదే ఫోన్‌ చేస్తుడడంతో తమ ఇంటికి బంగారాన్ని చూపించాలనడంతో దుండగుడు  నెక్కొండ మండల కేంద్రానికి వచ్చి రెండు చిన్న బంగారు బిళ్లలను అప్పగించి కేవలం రూ.500    తీసుకుని వెళ్లాడు. తదుపరి రెండు రోజు తర్వాత ఫోన్‌ చేసి అసలు బంగారమో నకిలీదో  తేల్చుకుని రండి మీకు ఎంత బంగారం కావాలంటె అంత అప్పగిస్తాను తులానికి  రూ.20వేల చొప్పున అని మాయ మాటలతో నమ్మించాడు.  పక్కనే ఉన్న  హుక్యా గతంలో ఇచ్చిన బంగారాన్ని చెక్‌ చేయించాడు. నిజమైన బంగారమని తేలడంతో ఇతరుల వద్ద అప్పుగా రూ. 4.50లక్షలు తీసుకువచ్చి వెంకన్నతో పాటు మరో వ్యక్తితో బల్లారి బయలుదేరారు. బల్లారి వద్ద  దబ్బులను దుండగుల చేతిలో పెట్టి నకిలీ బంగారం తీసుకు వచ్చారు
  
రౌడీలకు బయపడి... 
దుండగుడు నకిలీ బంగారం ఇచ్చాడని నిర్ధారణకు వచ్చిన హుక్యా, వెంకన్న  వారిని నిలిదిసేందుకు బయపడ్డారు. డబ్బులు చెల్లించి నకిలీ బంగారం తీసుకునే సమయంలో సుమారు ఇరవై మంది పక్కనే ఉన్నట్లు తెలిపారు. ప్రాణాలను రక్షించుకోవాలనే తపనతో అక్కడి నుండి బయపడి వెనక్కి తిరిగారు.

పోలీసులు ఫోన్‌ చెసినప్పటికీ..
కర్ణాటక పోలీసులు కొద్ది రోజులకు దుండగులను పట్టుకుని విచారిస్తున్న సమయంలో వారి ఫోన్‌ నంబర్లు బయటపడ్డాయి. ఫోన్‌ సమాచారంతో పోలీసులు బాధితుడికి ఫోన్‌ చేసి బల్లారికి వచ్చి పిటిషన్‌ ఇవ్వాలని తెలిపినప్పటికీ బాధితుడు బయపడి బల్లారికి వెల్లడం మానేశాడు. పోలీసులు మాత్రం దుండగులను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బాధిడుతు ఫిర్యాదు చేస్తే సహకారం అందిస్తామని కర్ణాటక పోలీసులు తెలిపినట్లు సమాచారం. స్థానిక పోలీసులు సహకరించి డబ్బులు ఇప్పించాలని బాధిడుతు, అతడి భార్య వేడుకుంటున్నారు.   

మరిన్ని వార్తలు