ఓ ఇంట్లో రూ.200 కోట్ల డబ్బు ఉందని.. కలకలం

6 Dec, 2018 13:28 IST|Sakshi
పెద్దకొట్టాలలో ఇంటిని పరిశీలిస్తున్న నంద్యాల డీఎస్పీ గోపాలకృష్ణ

కర్నూలు, నంద్యాల: ఒక ఇంట్లో రూ.200 కోట్ల డబ్బును అట్టపెట్టెల్లో దించామని ఓ వ్యక్తి నంద్యాల తాలూకా పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు హుటాహుటిన వెళ్లి సోదాలు చేశారు. వారికి ఏమీ లభ్యం కాలేదు. ఈ విషయం నంద్యాల నియోజకవర్గంలో కలకలం సృష్టించింది. తాలూకా సీఐ రవిశంకర్‌రెడ్డి తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాల మండలం పెద్దకొట్టాల గ్రామానికి చెందిన రఘురామిరెడ్డి, రామచంద్రారెడ్డి నివాసంలో రూ.200 కోట్ల డబ్బులు అట్టపెట్టెల్లో ఉంచి దింపినట్లు మండలంలోని పాండురంగాపురం గ్రామానికి చెందిన శంకర్‌రెడ్డి బుధవారం పోలీసులకు సమాచారంఅందించాడు. దీనిపై అనుమానం వచ్చిన సీఐ.. అంత డబ్బు ఆ ఇంట్లో ఎందుకు దించారని, ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. వజ్రాల వ్యాపారం చేస్తారని, డబ్బు దింపడానికి తనను కూడా రమ్మన్నారని, అయితే తాను వెళ్లలేదని తెలిపాడు.

అయితే వెళ్లిన వారిలో తనకు తెలిసిన వారు ఉన్నారని, వారు చెప్పిన ప్రకారం 20రోజుల కిందట  ఇంట్లో డబ్బు దింపారని నమ్మకంగా చెప్పడంతో పోలీసులు ముందుగా అక్కడికి కొందరిని పంపి పరిశీలించారు. తలుపులకు రెండేసి తాళాలు ఉండటంతో డీఎస్పీకి సమాచారం అందించారు. వెంటనే డీఎస్పీ గోపాలకృష్ణ, సీఐ రవిశంకర్‌రెడ్డి రెవెన్యూ అధికారులతో కలిసి గ్రామానికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో రెవెన్యూ అధికారుల సమక్షంలో ఇంటి తాళాలు పగులగొట్టారు. ఇంట్లో మూడు వాకిళ్లు ఉండగా ఒక్కొక్క వాకిలికి రెండేసి తాళాలు వేసి ఉన్నాయి. మూడు రూంల తాళాలు పగులగొట్టి క్షుణ్ణంగా సోదాలు చేశారు. అయితే.. వారికి ఎలాంటి నగదు లభ్యం కాలేదు. కాగా..పోలీసు సోదాల విషయం తెలిసి గ్రామస్తులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఇదే విషయంపైనే చర్చ జరిగింది. శంకర్‌రెడ్డి ఎందుకు అలా  సమాచారం ఇచ్చాడు, రామచంద్రారెడ్డి, రఘురామిరెడ్డి  వాళ్ల ఇంటికి  రెండేసి తాళాలు చొప్పున ఎందుకు వేసుకున్నారన్నది చర్చనీయాంశమైంది. ఇంటి యజమానులకు ఫోన్‌ చేస్తే ఇద్దరివీ స్విచ్‌ఆఫ్‌ వస్తున్నాయని సీఐ రవిశంకర్‌రెడ్డి తెలిపారు. తప్పుడు సమాచారం ఇచ్చిన శంకర్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సిగరేట్‌ ముక్కతో 100 వాహనాలు దగ్ధం!

యాత్రికుల బస్సు బోల్తా.. ఒకరి మృతి

శ్రీనివాస్‌ పోలీసుల్నీ తప్పుదోవ పట్టించాడు..

భర్తే లోకమని..

రైతు ఆత్మహత్యాయత్నం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మహేష్ ‘మహర్షి’ వాయిదా

బి.సరోజాదేవికి ‘విశ్వనట సామ్రాజ్ఞి’ బిరుదు ప్రదానం

సూపర్‌ స్టార్‌ బాటలో కల్యాణ్‌ రామ్‌

హీరోగా ఎంట్రీ ఇస్తున్న రకుల్ సోదరుడు

రష్మిక కోలీవుడ్‌ ఎంట్రీ ఆ హీరోతోనే..!

యాత్ర పాటతో ఆకట్టుకుంటున్న చిన్నారి