చేబ్రోలులో రూ.50 నకిలీ నోట్ల చలామణి

27 Jan, 2018 08:51 IST|Sakshi
ఫొటోలోని పై నోటు ఒరిజినల్, కింద నోటు నకిలీవి

పెద్ద నోట్లు వదిలి చిన్నపాటి నోట్లపై అక్రమార్కుల దృష్టి

చేబ్రోలు: మండలంలో రూ.50ల నకిలీ నోట్ల చెలామణీ యథేచ్ఛగా కొనసాగుతుంది. రూ.500, రూ. వెయ్యి నోట్ల నకిలీ నోట్లు విచ్చలవిడిగా వస్తున్నాయనే కారణంతో 2016 నవంబర్‌లో వాటిని రద్దు చేసి కొత్త నోట్లను చలామణిలో తీసుకువచ్చారు. రూ.2వేలు, రూ.500ల నోట్ల మీద ప్రతి ఒక్కరికి నిఘా ఉండటం బ్యాంకుల్లోను యంత్రాల్లో పరిశీలిస్తుండటంతో పెద్ద నోట్లను వదిలిపెట్టి అక్రమార్కులు చిన్నపాటి నోట్లపై దృష్టి సారించారు. పెట్రోలు బంకులు, కిళ్లీ బంకులు, కిరాణా షాపులు, మెడికల్‌ షాపులు, బట్టల షాపులు ఇలా ప్రతి షాపుల్లోనూ నకిలీ నోట్ల చలామణి సాఫీగా సాగిపోతుంది. చేబ్రోలులో ఒక షాపులో నకిలీ రూ.50ల నోట్లను షాపు యజమాని గుర్తించి తీసుకోకపోవటంతో విషయం వెలుగులోకి వచ్చింది.నకిలీ నోట్లు అసలు నోటు మాదిరిగానే ఉండటంతో అధికారులు, ఉద్యోగులు కూడా గుర్తించలేని విధంగా అక్రమార్కులకు తయారు చేస్తున్నారు.  బ్యాంకుల్లో, షాపుల్లో కూడా నకిలీ నోట్లు మారుతుండటం విశేషం.

నకిలీ నోట్లు గుర్తించడం ఇలా...
రూ.50 నోటు గాంధీ బొమ్మ వైపు ఆర్‌బీఐ పేరుతో వెండిగీత కనిపిస్తుండగా నకిలీ నోటుపై ఇవి కనిపించటం లేదు. అసలు నోటుపై భాగంలో చుక్కలు కనిపిస్తుండగా నకిలీ నోటులో ఉండటం లేదు. రూ.50ల అసలు నోటుకు  పక్కన చుక్కలు, పద్మం లాగా ఉంది. కింద తయారీ సంవత్సరం ఉంది. నకిలీ నోటుకు అంచున పువ్వు గుర్తు మాత్రమే ఉండి చుక్కలు లేకుండా ఉన్నాయి. పార్లమెంటు బొమ్మ కింద ఉండాల్సిన ప్రింట్‌ అయిన సంవత్సరం ఉండటం లేదు.  ఇలా తీక్షణంగా పరిశీలిస్తే అసలు నోటు నకిలీ నోటును గుర్తించవచ్చు.

మరిన్ని వార్తలు