ప్రియురాలి కోసం పోలీసు అవతారం..

22 Apr, 2019 07:45 IST|Sakshi
పోలీసుల అదుపులో నిందితుడు ,పోలీసు యూనిఫాంలో నిందితుడు రవిచంద్ర

మారేడుపల్లి : బీటెక్‌ చదివాడు.. అది పూర్తి చేయలేకపోయాడు.. నగరంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా చేరాడు.. స్వగ్రామంలో ఓ యువతిని ప్రేమించాడు.. అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు.. దీంతో ఏం చేయాలో పాలుపోలేదు.. తనకు డీఎస్పీగా ఉద్యోగం వచ్చిందని ప్రియురాలికి చెప్పాడు.. యూనిఫాం వేసుకొని ఫొటోలు తీసి పంపాడు.. నిజమేనని అమ్మాయితోపాటు ఆమె తల్లిదండ్రులు నమ్మారు.. అంతేకాదు సొంత తల్లిదండ్రులను కూడా నమ్మించాడు..చివరకు విషయం బయటపడటంతో వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి ఆదివారం మారేడ్‌పల్లి పోలీసులకు అప్పగించారు. మారేడుపల్లి సీఐ శ్రీనివాసులు తెలిపిన మేరకు.. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంకు చెందిన ఎం.వి.రవిచంద్ర (29) మూడు సంవత్సరాలుగా వెస్ట్‌ మారేడుపల్లిలోని సామ్రాట్‌కాలనీ రేఖా రెసిడెన్సీలో  నివాసముంటున్నాడు. స్థానికంగా కాలనీవాసులకు, ఇంటి పరిసర ప్రాంతాల వారికి తాను ఇంటెలిజెన్స్‌ డిపార్ట్‌మెంట్‌లో డీఎస్‌పీగా విధులు నిర్వహిస్తున్నానని నమ్మబలికాడు.

2012లో రిక్రూట్‌మెంట్‌ బ్యాచ్‌కు చెందిన వాడినని పలువురికి చెప్పుకున్నాడు. పోలీసు యూనిఫాంతో పాటు ఐడీ కార్డు, నేమ్‌ ప్లేటులతో ఏసీపీగా చలామణి అవుతున్నాడు. తరచుగా యూనిఫాంలో తిరుగుతూ స్థానికులను నమ్మించాడు. వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం అందడంతో రవిచంద్రను అదుపులోకి తీసుకుని విచారించగా నకిలీ విషయం బయటపడింది. నిందితుడిపై 2015లో నేరేడ్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌లో పరిధిలో ఓ వ్యక్తిపై దాడికి పాల్పడడంతో పాటు బెదిరింపులకు పాల్పడిన కేసులో పోలీసులు ఎం.వి.రవిచంద్రను అరెస్టుచేశారు. పోలీసు అధికారిగా చెప్పుకుంటూ పలువురిని బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు నిందితుడిని అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు.గతంలో జైలుకు వెళ్ళివచ్చినా నిందితుడిలో మార్పు రాలేదు. మరొకసారి టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నిందితుడిని అరెస్టుచేశారు.  నిందితుడి వద్ద నుండి ఐడి కార్డు, పోలీస్‌ యూనిఫాం, నేమ్‌ ప్లేట్, మెడికల్‌ సర్టిఫికెట్, గ్రీన్‌ ఇంక్‌ పెన్, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీన పర్చుకున్నారు. రవిచంద్ర స్నేహితులనే తన ఉన్నతాధికారులుగా పలువురికి పరిచయం చేశాడు.  రవిచంద్రవల్ల మోసపోయిన వారెవరైనా ఉంటే  మారేడుపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సీఐ శ్రీనివాసులు కోరారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అన్నదమ్ములు దారితప్పి..దొంగలయ్యారు

మరిదితో వివాహేతర సంబంధం.. దారుణ హత్య

ప్రియురాలి తండ్రి కిడ్నాప్‌

వివాహమైన వారానికే.. దారుణహత్య

సరుకు లేకుండానే రూ.133 కోట్ల వ్యాపారం

పోలీసులు అరెస్ట్‌ చేస్తారని.. గోడ దూకి పారిపోయా

సెల్‌ఫోన్‌ చోరీ వివాదం.. యువకుడి హత్య

ముఖంపై చిరునవ్వు.. మీసంపై చెయ్యి: సెల్ఫీసూసైడ్‌

సోలార్‌ ప్లాంటేషన్‌లో భారీ అగ్నిప్రమాదం

వరుడు పెళ్లి చేసుకోనన్నాడని..

రవిప్రకాశ్‌కు హైకోర్టులో చుక్కెదురు

ఏసీ కోచ్‌లో మహిళ దారుణ హత్య..!

తండ్రిని చంపి.. 25 ముక్కలుగా నరికి..

అజ్ఞాతం నుంచి రవిప్రకాశ్‌ వీడియో సందేశం!

కిరాతకంగా నరికి చంపారు 

ఆరిన ఇంటి దీపాలు

యువతీయువకుల ఆత్మహత్య

ప్రేమకథ విషాదాంతం

ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురి దుర్మరణం

రవిప్రకాశ్‌ మరోసారి...

ఆదాయానికి గండి...

కుమార్తెను చూసేందుకు వచ్చిన స్నేహితురాలితో..

టిక్‌టాక్‌ సెలబ్రిటీ దారుణ హత్య

బాలిక అదృశ్యం

ఆరిన ఆశాదీపాలు

వెనుకసీటులో కూర్చున్న వృద్ధుడి పైశాచికత్వం

ఖాకీ.. ఇదేం పని..?

వివాహేతర సంబంధం మోజులో కిరాతకం

రవిప్రకాశ్‌ కోసం మూడు బృందాలు 

అయ్యో.. నా కొడుకును నేనే చంపేశానా!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మా నాన్నకి గిఫ్ట్‌ ఇవ్వబోతున్నాను

అంజలి చాలా నేర్పించింది!

ఆ లోటుని మా సినిమా భర్తీ చేస్తుంది

ఆడియన్స్‌ క్లాప్స్‌ కొడతారు

చలో చెన్నై

‘విజయగర్వం నా తలకెక్కింది’