సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ నంటూ కిలాడీ.. లేడీ

2 Nov, 2019 07:52 IST|Sakshi
అరెస్టయిన ముగ్గురు

నకిలీ ఎస్‌ఐని అరెస్ట్‌ చేసిన పోలీసులు

చెన్నై ,అన్నానగర్‌: తాను సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ నంటూ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి మహిళ అరెస్టయిన ఘటన శుక్రవారం చిదంబరంలో జరిగింది. వివరాలు.. కడలూర్‌ జిల్లా చిదంబరం నగర పోలీసు ఇన్‌స్పెక్టర్‌ మురుగేషన్‌ ఆధ్వర్యంలో పోలీసులు గురువారం రాత్రి గాంధీ విగ్రహం సమీపంలో వాహన తనిఖీలు చేపట్టారు. మందక్కరై ప్రాంతానికి చెందిన చక్రపాణి మద్యం సేవించి ద్విచక్రవాహనాన్ని నడపడంతో అతని మీద కేసు నమోదు చేసి బైకుని స్వాధీనం చేసుకున్నారు. దీని గురించి చక్రపాణి తన బంధువు రాజదురై, అతని భార్య సూర్యప్రియ (27)తో చర్చించాడు. అనంతరం సూర్యప్రియ పోలీసు యూనిఫామ్‌ ధరించుకొని శుక్రవారం ఉదయం చిదంబరం పోలీసు స్టేషన్‌కి వెళ్లింది. తాను చెన్నై నీలాంగరై పోలీసు స్టేషన్‌లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్నట్లు చెప్పింది.

మద్యం మత్తులో వాహనం నడుపుకొని వచ్చిన చక్రపాణి బైకుని ఇవ్వాలంటూ అడిగింది. ఆమె తీరుపై అనుమానం రావడంతో స్థానిక పోలీసులు నీలాంగరై పోలీసుస్టేషన్‌కి ఫోన్‌ చేసి విచారించగా అసలు విషయం బయటపడింది. ఆ పేరుతో అక్కడ ఎవరూ పనిచేయడం లేదని తేలింది. అనంతరం జాయింట్‌ పోలీసు సూపరింటెండెంట్‌ కార్తిగేయన్, సూర్య ప్రియ గురించి విచారించగా ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. సూర్యప్రియా పోలీసు యూనిఫామ్‌ ధరించి తన భర్త రాజదురై, బంధువు చక్రపాణితో కలిసి తరచూ వసూళ్లకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. వాహన దారులను అడ్డుకొని నగదు లాక్కోవటం, కొంత మందికి ప్రభుత్వ కార్యాలయాలలో కుల, ఆదాయ సర్టిఫికేట్లు ఇప్పిస్తానంటూ మోసం చేస్తూ వచ్చినట్లు తెలిసింది. అనంతరం సూర్యప్రియ, రాజదురై, చక్రపాణిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కొడుకును చంపిన తండ్రి

కీర్తి కేసు.. ఒక్కో దాంట్లో ఒక్కో ‘పాత్ర’

ప్రియురాలితో మాట్లాడే సమయంలో..

ఆడ పిల్లలను కన్నదని.. అతి కిరాతకంగా 11 చోట్ల కత్తితో నరికి

గ్రామవలంటీర్లపై జనసేన కార్యకర్తల దాడి

ఆటో డ్రైవర్‌ నమ్మకద్రోహం!

విశాఖ భూ కుంభకోణంపై విచారణ ప్రారంభం

ఇద్దరు ప్రియులతో కలసి..

చోరీ కేసు ఛేదనకు వెయ్యిమంది సహకారం 

దేవికారాణి, నాగలక్ష్మిల విలాస జీవితాలు!

విజయవాడలో దొంగల హల్‌చల్‌ 

టీటీడీ వలలో పెద్ద దళారీ

ఒక దొంగను పట్టుకోవటానికి వెయ్యి మంది..

గంటలో వస్తానన్నాడు..

తొలుత గొంతు కోసి హత్య చేసి.. ఆ తరువాత..

వివాహితుడితో ప్రేమ.. బాలిక ఆత్మహత్య

భర్తే హంతకుడు

భార్య పళ్లు ఎత్తుగా ఉన్నాయని పెళ్లైన 3 నెలలకే..

సినీ నటికి మూడేళ్లు జైలుశిక్ష

కీర్తికి అబార్షన్ చేసింది ఎవరు?

నోటికి ప్లాస్టర్‌ అంటించి, అగర్‌బత్తీలతో కాల్చి...

బ్యాంకులో మీ బంగారం సేఫేనా?

ఆర్మీ సిపాయిపై చిన్నారి ఫిర్యాదు

భార్యాభర్తలను ఢీ కొట్టిన పెట్రోల్‌ ట్యాంకర్‌

వివాహమైన ఏడాదికే..

పత్తి ఏరడానికి చేనుకు వెళ్తే..

బాలికపై లైంగికదాడికి ప్రిన్సిపాల్‌ యత్నం

గండికోటలో ప్రేమజంట కథ విషాదాంతం

మంటల్లో రైలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హాస్య నటుడిని మోసం చేసిన మేనేజర్‌

యాక్షన్‌ పెద్ద హిట్‌ అవుతుంది

మంచి కామెడీ

అమ్మ దీవెనతో...

రజనీ వ్యూహం?

ఇంకో పోలీస్‌ కావలెను!