నకిలీ మహిళా డాక్టర్‌ అరెస్ట్‌

26 Oct, 2017 06:24 IST|Sakshi
స్వప్న

తిరుత్తణి: ప్లస్‌టూ వరకు చదువుకుని క్లినిక్‌ పెట్టి వైద్య సేవలు అందించిన నకిలీ మహిళ డాక్టర్‌ను  ఆరోగ్యశాఖ  అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్‌ చేశారు.  తిరువళ్లూరు జిల్లాలో విష జ్వరాలు, డెంగీతో  ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. విషజ్వరాలు, డెంగీతో బాధపడుతున్న గ్రామీణులకు అవగాహన లేక తమ ప్రాంతంలోని నిర్వహిస్తున్న వైద్య కేంద్రాలకు వెళ్లి చికిత్స పొందడం ద్వారా  ప్రాణాలు కోల్పోతున్నారు.ఈ విషయమై స్థానికుల ఫిర్యాదు మేరకు జిల్లా యంత్రాంగం స్పందించి నకిలీ వైద్యులను గుర్తించి అరెస్ట్‌ చేస్తున్నారు.

తిరుత్తణి సమీపంలోని కేజీ.కండ్రిగలో వారం రోజుల కిందట నకిలీ డాక్టర్‌ను అరెస్ట్‌ చేసిన నేపథ్యంలో బుధవారం  జిల్లా ఆరోగ్యశాఖ అదనపు డైరెక్టర్‌  డాక్టర్‌ దయాళన్‌ ఆధ్వర్యంలో వైద్య బృందం కేజీ.కండ్రిగలో బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా షణ్ముగసుందరం పేరిట క్లినిక్‌ నిర్వహిస్తున్న స్వప్న(32) అనే  మహిళను అదుపులో తీసుకుని విచారించగా ప్లస్‌టూ వరకు చదువుకుని క్లినిక్‌ నిర్వహించి వైద్య సేవలు చేస్తున్నట్లు గుర్తించారు. ఆరోగ్యశాఖ అధికారుల సూచన మేరకు తిరుత్తణి పోలీసులు అరెస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు