ఒకరి వెంట ఒకరు..

18 Jul, 2019 09:40 IST|Sakshi
పవన్‌ కర్భంద, నీలం కర్భంద మృతదేహాలు (ఫైల్‌)

లోకాన్ని విడిచివెళ్లిన కుటుంబం

భార్య మృతిని తట్టుకోలేక భర్త, వారి మరణాలను

జీర్ణించుకోలేక పిల్లల ఆత్మహత్య

11న తల్లిదండ్రుల మృతి

14న కుమారుడు, 17న కుమార్తె మృత్యువాత

దహన సంస్కారాలు చేసిన బంధువులు

అంబర్‌పేట: తల్లి మరణాన్ని తట్టుకోలేక ఓ కుటుంబం మొత్తం తనువు చాలించింది. ఆమె మరణించిన కొన్ని గంటల్లోనే తట్టుకోలేని జీవిత భాగస్వామి గుండె ఆగిపోయింది. కన్న తల్లిదండ్రులు కళ్ల ముందే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ ఇద్దరు పిల్లలు తనువు చాలించారు. ఈ నెల 14న డీడీ కాలనీలో చోటు చేసుకున్న  విషాదకర సంఘటన వివరాల్లోకి వెళితే..పంజాబ్‌ నుంచి కుటుంబంతో సహా నగరానికి వలస వచ్చిన పవన్‌ కర్భందాకు ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు అక్కా, చెల్లెల్లు ఉన్నారు. వీరంతా నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో స్ధిరపడ్డారు. అయితే పవన్‌ కర్భందా కుటుంబానికి బంధువులు, ఇతర కుటుంబసభ్యులతో సత్సంబంధాలు లేవు. అందరికీ దూరంగా డీడీ కాలనీలో భార్య నీలం కర్భందా, కుమార్తె మన్ను కర్భందా(34), కుమారుడు నిఖిల్‌ కర్భందా(30)లతో కలిసి ఉంటున్నాడు. పవన్‌ ట్రూప్‌బజార్‌లో ఉద్యోగం చేస్తుండగా కుమారుడు బెంగుళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు.

అతడి భార్య నీలం కర్భందా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఈ నెల 11న మృతిచెందింది. భార్య మృతదేహాన్ని తండ్రీ, పిల్లలు ఇంటికి తీసుకువచ్చారు. ఈ విషయం స్థానికులెవరికీ తెలియకపోవడం గమనార్హం. మృతదేహాన్ని ఇంట్లో ఉంచుకుని ముగ్గురూ ఎటూ పాలుపోని స్థితిలో కొట్టుమిట్టాడారు. రాత్రి 7 గంటల ప్రాంతంలో నగరంలోనే మరో ప్రాంతంలో ఉంటున్న బంధువుకు పవన్‌ సమాచారం అందించాడు. అయితే అతడికి వారి ఇంటి చిరునామా తెలియకపోవడంతో ఉదయం అక్కడికి వచ్చాడు. అయితే ఇంట్లో నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తిరిగి వెళ్లిపోయాడు. మర్నాడు ఉదయం అక్కడికి వచ్చిన అతను కుటుంబసభ్యుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అనుమానంతో పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులతో కలిసి బలవంతంగా ఇంటి తలుపులు తెరిచి చూడగా తల్లిదండ్రులిద్దరూ విగతజీవులుగా పడి ఉన్నారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వారి ఇద్దరు పిల్లలు  కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ కనిపించారు. పోలీసులు వారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మొదట ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో నలుగురు ఆత్మహత్యకు పాల్పడినట్లు భావించారు. అయితే అనారోగ్యంతో తల్లిదండ్రులు మృతి చెందడాన్ని జీర్ణించుకోలేక పిల్లలిద్దరూ  ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టినట్లు తేలడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు.

తొలుత తల్లి..చివర కుమార్తె..
ఈ నెల 11న  మధ్యాహ్నం తల్లి నీలం కర్భందా మృతిచెందగా, ఆమె మరణాన్ని తట్టుకోలేక తండ్రి పవన్‌ కర్భందా అదేరోజు రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో అక్కడే ఉన్న ఆతడి కుమార్తె, కుమారుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వారిలో నిఖిల్‌ ఈ నెల 14న రాత్రి చికిత్స పొందుతూ మృతిచెందగా, కుమార్తె మన్ను కర్భందా బుధవారం మధ్యాహ్నం కన్నుమూసింది. 

అందరూ ఉన్నా..
పవన్‌ కర్భందాకు బంధువులు చాలా మంది ఉన్నట్లు తెలిసింది. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, వారి పిల్లలు సైతం నగరంలోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. అయినా వారితో బంధాలను తెంచుకొని కుటుంబంతో ఒంటరిగా ఉంటుండటమే ఈ విషాదానికి కారణంగా తెలుస్తోంది. దీనికితోడు పిల్లలకు వివాహాలు కాకపోవడం కూడా  ఈ విషాదానికి కారణమై ఉండవచ్చు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మత్తులో కత్తులతో వీరంగం!

మోసగాడు.. ఇలా దొరికాడు

ఆషాఢమని భార్య పుట్టింటికి వెళితే..

ప్రేమ జంటలే టార్గెట్‌

‘ఆ ఊహనే భరించలేకున్నా.. చనిపోతున్నా’

వివాహేతర సంబంధమా.. వ్యాపారుల మధ్య పోటీయా..?

ట్రాక్టర్‌ డ్రైవర్‌ దారుణహత్య

హిజ్రా చంద్రముఖి ఫిర్యాదు..

వందల కోట్లు లంచంగా ఇచ్చా

భర్త, కుమారుడిని వదిలేసి సహజీవనం.. ఆత్మహత్య

బాలికపై సామూహిక లైంగికదాడి

ఇంటి పైకప్పు కూలి చిన్నారి దుర్మరణం

కుప్పంలో దొంగనోట్ల ముఠా!

ఎంపీ గల్లా అనుచరులపై కేసు

అనసూయ పేరుతో అభ్యంతరకర పోస్టులు

ప్రేమ వ్యవహారమేనా..?

సౌదీలో పరిచయం.. తమిళనాడులో సంబంధం

బ్యూటీషియన్‌ దారుణ హత్య

అమెరికాలో పూజారిపై దాడి

హైదరాబాద్‌కు ఐసిస్‌ నమూనాలు!

ముసద్దిలాల్‌ జ్యువెల్లర్స్‌పై మరో కేసు

షేక్ సద్దాంను హత్య చేసిన నిందితుల అరెస్ట్‌

ఉపాధ్యాయుల ఇళ్లలో భారీ చోరీ

నిరుద్యోగులే టార్గెట్‌.. రూ.కోటితో ఉడాయింపు!

నిజామాబాద్‌ జిల్లాలో దారుణం

ఉద్యోగాలిప్పిస్తానని.. ఉడాయించేశాడు..!

రక్తంతో గర్ల్‌ఫ్రెండ్‌కు బొట్టుపెట్టి..

పింకీ! నీవెలా చనిపోయావో చెప్పమ్మా..

బాలిక దారుణ హత్య: తండ్రిపైనే అనుమానం!

రక్షక భటుడు.. దోపిడీ ముఠాకు సలహాదారుడు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ ట్రెండింగ్‌పై నాగార్జున ట్వీట్‌

తమిళ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా సెల్వమణి

జాన్వీకపూర్‌తో దోస్తీ..

రకుల్‌కు చాన్స్‌ ఉందా?

ఆలియా బాటలో జాక్వెలిన్‌

తమిళంలో తొలిసారి