వేధింపులే ప్రాణాలు తీశాయా?

18 Aug, 2019 07:45 IST|Sakshi
రోదిస్తున్న ఓం ప్రకాశ్‌ సోదరి

మైసూరు వ్యాపారవేత్త ఓం ప్రకాశ్‌

కాల్పులు ఘటనలో దర్యాప్తు ముమ్మరం

బంధువులు, స్నేహితుల రోదనల మధ్య అంత్యక్రియలు  

కర్ణాటక, మైసూరు : చామరాజనగర జిల్లా గుండ్లుపేటె వద్ద మైసూరుకు చెందిన ఓ వ్యాపారవేత్త తన కుటుంబ సభ్యులను చంపి తానూ కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో ప్రత్యేక పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ బాలకృష్ణ తెలిపారు. ప్రస్తుతం హత్య, ఆత్మహత్యలా అనే అనుమానాలు కూడా ఉన్నాయన్నారు.  అండర్‌ వరల్డ్‌ డాన్‌ల వేధింపులను తట్టుకోలేకనే ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులతో పాటు అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కమిషనర్‌  బాలకృష్ణ నేతృత్వంలో పోలీసుల బృందం  నగరంలోని దట్టగళ్లిలో ఉన్న ఓం ప్రకాశ్‌ ఇంటికి వచ్చి ఆయన సోదరి సమక్షంలో ఓం ప్రకాశ్‌ ఇంటి తలుపులు తెరిచి పరిశీలన చేశారు. అయితే ఇంటిలో బట్టలు మూటలు కట్టి ఉన్నాయి. ఇల్లు ఖాళీ చేయడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఓం ప్రకాశ్‌ సెల్‌ఫోన్‌కు వచ్చిన నెంబర్లను పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.  

రోదిస్తున్న స్నేహితులు
రోదనల మధ్య అంత్యక్రియలు :  ఓం ప్రకాశ్‌తో పాటు మిగతా ఐదు మృతదేహాలను ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం దట్టగహళ్లిలోని నివాసానికి తీసుకువచ్చారు. విగత జీవులుగా పడి ఉన్న వారిని చూసి బంధువులు, స్నేహితుల రోదనలు మిన్నంటాయి.  అనంతరం చాముండి కొండ లోయవద్ద ఉన్న çస్మశాన వాటికలో సామూహికంగా అంత్యక్రియలు నిర్వహించారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు