అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

20 Nov, 2019 10:13 IST|Sakshi
రాజిరెడ్డి మృతదేహం

సాక్షి, దోమకొండ: దోమకొండ మండలం గొట్టిముక్కుల గ్రామానికి చెందిన రైతు ధర్పల్లి రాజిరెడ్డి(46) మంగళవారం సాయంత్రం అప్పుల బాధతో వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. రాజిరెడ్డికి గ్రామ శివారులో రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దాంట్లో మొక్కజొన్న సాగు చేశాడు. అకాల వర్షాలతో పంట దెబ్బతింది. వచ్చిన పంటను తక్కువ ధరకు అమ్ముకున్నాడు. దీనికి తోడు ఇటీవల నెల క్రితం రాజిరెడ్డి కుమారుడు సాగర్‌కు యాక్సిడెంట్‌ కాగా ఆస్పత్రిలో దాదాపు  రూ.మూడు లక్షల వరకు ఖర్చయింది. దీంతో మానసికంగా కృంగిపోయిన రాజిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య శ్యామల, కుమారులు సాగర్, సంపత్‌ ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై రాజేశ్వర్‌గౌడ్‌ తెలిపారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..!

కారం చల్లి.. గొంతుకోసి వ్యక్తి హత్య

పురుగు మందు తాగి.. కొడుక్కి పట్టించి.. 

లెగ్గింగ్స్‌ వేసుకొచ్చారని మైనర్స్‌పై దారుణం

పుట్టింటికి వెళ్లిన భార్య రాలేదని...

రైలుకు ఎదురుగా వెళ్లి ప్రేమజంట ఆత్మహత్య 

దయ లేని విధి

వైఎస్సార్‌సీపీ నాయకుడిపై మారణాయుధాలతో దాడి

ఉపాధ్యాయుడి వేధింపులకు విద్యార్థిని బలి

కర్నూలు నేషనల్ హైవేపై దారిదోపిడీ

కన్నతల్లిపై కూతురు కక్ష.. 20వేల సుపారీ!

సిన్మాలు చూసి.. ఇంటర్నెట్‌లో వెతికి..!

ప్రేమించిందని కన్న కూతురినే..

దారుణం : కాల్చి చంపి.. కాళ్లు నరికి..!

తాగిన మైకంలో వరసలు మరిచి..

బురిడీ కొట్టించి ‘దృశ్యం’ చూపిస్తాడు

250 మంది చిన్నారులను లైంగికంగా వేధించి..

ప్రేమించిన వాడితో పారిపోతుందని తెలిసి..

పిల్లల విషయంలో జర జాగ్రత్త

చేతిలో ఫోన్‌ ఉంది కదా అని షాపింగ్‌ చేస్తే

ఆయన కంటే ముందే నేను చనిపోతాను

వైఎస్సార్‌సీపీ నేత హత్య కేసులో 9 మంది అరెస్ట్‌

క్షుద్రపూజలు చేయించిందని వేధించడంతో..

గనిలో పేలుడు.. 15 మంది మృతి

ఇద్దరిని బలి తీసుకున్న అతివేగం

హత్య చేసి.. తగలబెట్టి..

‘ఉత్తరాన’ నేరాలు... ‘పశ్చిమాన’ నేరగాళ్లు!

తప్పుడు పత్రాలతో నిందితులకు బెయిల్‌ 

ప్రేమ పేరుతో వేధింపులు.. 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

టాలీవుడ్‌లో ఐటీ దాడుల కలకలం

సూర్యతో మరోసారి స్వీటీ ?

కృష్ణ.. ‘గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌’ 

జార్జ్‌ రెడ్డి లాంటి సినిమాలు రావాలి

హీరో ఎవరో ప్రేక్షకులే చెబుతారు: రాజేంద్రప్రసాద్‌

మళ్లీ శాకాహారం