ఎవుసం యమపాశమై..

26 Apr, 2018 11:38 IST|Sakshi
మల్లారెడ్డి మృతదేహం, మల్లారెడ్డి(ఫైల్‌)

గిట్టుబాటు కాని వ్యవసాయం  కలిసిరాని కాలం  

పెరిగిన అప్పులు 

మనస్తాపంతో కౌలురైతు బలవన్మరణం 

అల్గునూర్‌(మానకొండూర్‌) : భూమిని నమ్ముకున్న ఆ రైతుకు వ్యవసాయం కలిసిరాలేదు. దీంతో పగబట్టిన ప్ర కృతికి ప్రాణాలు ఫణంగా పెట్టాడు. వ్యవసాయం కోసం చేసిన అప్పులు పెరిగిపోవడంతో దిక్కుతోచక పురుగుల మందు తాగి తనువు చాలించాడు. ఈ ఘటన తిమ్మాపూర్‌ మండలం మొగిలిపాలెంలో బుధవారం జరిగింది. 
ఆధ్యాంతం విషాదం... 
గ్రామానికి చెందిన పాగాల మల్లారెడ్డి(58)కి భార్య అం జవ్వ, కుమారుడు కొండాల్‌రెడ్డి, కుమార్తె కోమల ఉన్నా రు. తనకు సాగుభూమి లేకున్నా 20 ఏళ్లుగా పలువురి భూములు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఐదేళ్లక్రితం సిద్దిపేటకు చెందిన వ్యక్తితో కూతు రు వివాహం జరిపించాడు. పెళ్లయిన తర్వాత భర్త పెట్టే వేధింపులు భరించలేక ఏడాదికే కోమల ఆత్మహత్య చేసుకుంది. దీంతో మల్లారెడ్డి కుంగిపోయాడు.
20 ఎకరాలు కౌలుకు...  
క్రమంగా కోలుకున్న ఆయన ఏడాది తర్వాత మళ్లీ నాగ లి పట్టాడు. గ్రామానికి చెందిన పిన్నింటి నర్సింహారెడ్డికి చెందిన 20 ఎకరాల భూమి ఏడాదికి రూ.1.50 లక్షల చొప్పున కౌలుకు తీసుకున్నాడు. కొడుకు కొండాల్‌రెడ్డి సహాయంతో సాగుచేస్తున్నాడు. మొదటి రెండేళ్లు అడపాదడపా కురిసిన వర్షాలకు దిగుబడి తక్కువగానే వచ్చి ంది. అయినా ఈ ఏడాదైనా కలిసిరాకుండా పోతుందా అన్న నమ్మకంతో రెండేళ్లుగా వరి, మొక్కజొన్న, పత్తి, వేరుశనగ, కూరగాయల పంటలు సాగుచేశాడు. ఇందు కు ఏడాదికి రూ.3 లక్షల చొప్పున గడిచిన రెండేళ్లలో రూ.6 లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు.
పెరిగిన అప్పులు.. 
గతంలోనూ రూ.2 లక్షల అప్పులు ఉన్నాయి. వరుస కరువొచ్చినా.. భూ యజమానికి రూ.1.50 లక్షలు కౌలు డబ్బులు ఇస్తున్నాడు. ఈ క్రమంలో 20 రోజుల క్రితమే ఈ ఏడాది కౌలు డబ్బులు రూ.లక్ష చెల్లించాడు. మరో రూ.50 వేలు చెల్లించాల్సి ఉంది. ఇప్పటి వరకు చేసిన అప్పులు వడ్డీతో సహా రూ.10లక్షలకు చేరడంతో మల్లారెడ్డి మనస్తాపం చెందాడు. 
పొలం వద్దకు వెళ్తున్నానని చెప్పి.. 
బుధవారం ఉదయం పొలం వద్దకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి 7:30 గంటలకు వెళ్లాడు. 9 గంటలకు పొలంలో పడిపోయి ఉన్న మల్లారెడ్డిని రైతు మధుకర్‌ చూశాడు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అ ందించాడు. వారు కరీంనగర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు గా విలపించారు. ఎస్సై నరేశ్‌రెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.  
మృతదేహంతో రాస్తారోకో
మల్లారెడ్డి మృతదేహంతో తిమ్మాపూర్‌ మండలం అల్గునూర్‌ చౌరస్తాలో 45నిమిషాలపాటు గ్రామస్తులు, అఖిల పక్షం నాయకులు రాస్తారోకో నిర్వహించారు. మల్లారెడ్డికి 3 ఎకరాల భూమి, 10లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు ఎల్కపల్లి సంపత్, సీపీఐ నియోజకవర్గ ఇన్‌చార్జి కేదారి, మొగిలిపాలెం ఉపసర్పంచ్‌ మోరపల్లి రమణారెడ్డి డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న ఎల్‌ఎండీ ఎస్‌ఐ నరేశ్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని వారితో మాట్లాడినా ఉపయోగం లేకుండా పోయింది.

దీంతో కరీంనగర్‌ నుంచి స్పెషల్‌ఫోర్స్‌ను పిలిపించారు. కరీంనగర్‌ వన్‌టౌన్‌ సీఐ శ్రీనివాసరావు, తిమ్మాపూర్‌ సీఐ కరుణాకర్‌ శవాన్ని ఆంబులెన్స్‌లో గ్రామానికి తరలించి, నాయకులను ఎల్‌ఎండీ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. రహదా రిని దిగ్భందించి, ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని ఆరోపిస్తూ రాస్తారోకోలో పాల్గొన్న వారిపై తిమ్మాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు