ఇసుక వివాదం: త‌ండ్రీ, కొడుకు‌ల హ‌త్య‌..

29 Jun, 2020 15:12 IST|Sakshi

భోపాల్ : ఇసుక గొడ‌వ కార‌ణంగా ప‌క్కింటి వారు దాడి చేయ‌డంతో తండ్రీ, కొడుకులు మృతిచెందిన ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో చోటుచేసుకుంది. వివారాల్లోకి వెళితే.. రాష్ట్ర రాజ‌ధాని భోపాల్‌కు 25 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న టికంగ‌ఢ్‌‌ గ్రామంలో దేశ్‌రాజ్(57) కుటుంబం నివాస‌ముంటోంది. ఈ క్ర‌మంలో శ‌నివారం సాయంత్రం పొరుగున ఉన్న మోహ‌న్‌లోధి, త‌న కుమారుడు బృందావన్ లోధితో క‌లిసి త‌మ ఇంటి ముందు ఇసుక‌ను క‌డుగుతుండ‌గా ఇందుకు దేశ్‌రాజ్‌ అభ్యంత‌రం వ్య‌క్తం చేశాడు. ఇసుక క‌డిగిన నీళ్లన్నీ త‌మ ఇంట్లోకి వ‌స్తుంద‌ని వాదించాడు. దీంతో కోపానికి గురైన మోహ‌న్‌లోధి దేశ్‌రాజ్‌పై గొడ‌వ‌కు దిగారు. ఇద్ద‌రి మ‌ధ్య నెల‌కొన్న‌ వాగ్వాదం పెద్ద‌ది కావ‌డంతో మోహ‌న్ లోధి, బృందావన్ లోధి త‌మ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి దేశ్‌రాజ్‌పై క‌ర్ర‌ల‌తో దాడికి తెగ‌బ‌డ్డారు. (పోలీసుల దాష్టీకానికి మ‌రో వ్య‌క్తి బ‌లి )

ఈ క్ర‌మంలో తండ్రిని కాపాడేందుకు వెళ్లిన దేశ్‌రాజ్ కుమారులు గులాబ్‌, జ‌హార్‌తోపాటు ఆయ‌న‌ భార్యపైనా దాడి చేసి తీవ్రంగా కొట్టారు.‌ ఈ ఘ‌ర్ష‌ణ‌లో గులాబ్ అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించ‌గా, ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ దేశ్‌రాజ్ కూడా మృతి చెందాడు. కాగా దేశ్‌రాజ్ భార్య సోనాభాయి, మ‌రో కుమారుడు తీవ్ర గాయాల‌తో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులకు ఫిర్యాదు చేయ‌గా.. తండ్రీ, కొడుకుల హ‌త్య‌ కేసుకు సంబంధించి మొత్తం 17 మందిపై కేసు న‌మోదు చేసిన‌ట్లు ఎస్సై బ్ర‌జేష్ కుమార్ తెలిపారు. నిందితులు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని, ఘటన అనంతరం పారిపోయిన వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. (బెంగళూరు: కూతురిపై తండ్రి అఘాయిత్యం)

అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి!

మరిన్ని వార్తలు