ఐదుసార్లు తాళికట్టి.. ఐదుసార్లు అత్యాచారం

13 Sep, 2019 06:06 IST|Sakshi
అరెస్ట్‌యిన నిందితులు

మహిళను వేధించిన కేసులో తండ్రి, కుమారుడు అరెస్ట్‌

కర్ణాటక,బనశంకరి: సర్పదోషం ఉందని నివారణకు  ఐదుసార్లు తాళికట్టించుకుని ఐదుసార్లు లైంగిక ప్రక్రియలో పాల్గొనాలని ఓ మహిళను మభ్యపెట్టిన కామాంధుడు కామస్వామి గణేశ్‌తో పాటు అతడి కుమారుడిని గురువారం బాణసవాడి పోలీసులు అరెస్ట్‌ చేశారు. బాధిత మహిళకు వివాహం కాగా భర్త నుంచి విడిపోయి వేరుగా నివాసముంటోంది. ఈమె బాణసవాడిలో ప్రైవేటు కంపెనీని ఉద్యోగి. సదరు మహిళకు సర్పదోషం ఉండగా తనకు పరిచయస్తులతో కలిసి కామస్వామి గణేశ్, అతడి కుమారుడు మణికంఠను సంప్రదించింది. ఈ నెల 7న కామస్వామి గణేశ్, మణికంఠ ఇద్దరు సర్పదోష నివారణ చేస్తామని సదరు మహిళతో రాత్రి 10 నుంచి 11 గంటల వరకు మహిళ ఇంట్లో పూజలు నిర్వహించారు. పూజ అనంతరం పూజచేసిన వస్తువులను కుక్కేసుబ్రమణ్యలో వదలాలని ఆమెకు సూచించారు. ఈ సమయంలో తండ్రి, కుమారుడు కుక్కె సుబ్రమణ్యలో రెండు ప్రత్యేక గదులు బుక్‌ చేసుకుని మహిళతో కామవాంఛ తీర్చుకోవడానికి పథకం రూపొందించారు. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న బాణసవాడి పోలీసులు తీవ్రంగా గాలించి గురువారం కామస్వామి గణేశ్, కుమారుడు మణికంఠను అరెస్ట్‌ చేసి తమదైనశైలిలో విచారణ చేపట్టారు.

ఫిర్యాదు వివరాలు :  తనకు సర్పదోషం ఉందని జగన్నాథ్‌ అనే వ్యక్తి కామస్వామి గణేశ్, అతడి కుమారుడు మణికంఠను పరిచయం చేశారని బాధితురాలు తెలిపింది. సర్పదోష నివారణకు పూజ చేయాలంటే రూ.40 వేలు ఖర్చు అవుతుందని కామస్వామి గణేశ్‌ తెలిపారని, అదే సమయంలో తన కాపురం కూడా నిలబడదని చెప్పారు. దీనికి ప్రత్యేక పూజలు చేయాలని పురమాయించారని బాధితురాలు పేర్కొంది. ఈనెల 7న తన ఇంటిలో సర్పదోష పూజల అనంతరం 8న తనను కుక్కె సుబ్రమణ్యకు తీసుకెళ్లి తనపై అత్యాచారం చేయడానికి యత్నించారని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.    

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఎస్‌ఐ అనురాధ ఫిర్యాదు, నన్నపనేనిపై కేసు

బైక్‌ దొంగ దొరికాడు

పెళ్ళై ఏడాది జరగకముందే..

రైలు ఢీకొని వివాహిత మృతి

దర్యాప్తు ముమ్మరం

కసిదీరా కొట్టి.. మర్మాంగాన్ని కోసి..

పరారీలో నిందితులు

కాటేసిన ప్రలోభం.. తల్లిదండ్రుల కన్నీరుమున్నీరు

యువతి ఎదుట ఆటోడ్రైవర్‌ అసభ్య చర్య!

న్యాయం చేయండి

నగదు కవర్‌ లాక్కెళ్లిన దొంగలు

మద్యం మత్తులో అన్నను చంపిన తమ్ముడు

టైతో ఉరేసుకున్న విద్యార్థి..

మందలించిన మామను హత్య చేసిన అల్లుడు

స్నేహితురాలితో మేడపై ఆడుకుంటూ...

టీఆర్‌ఎస్‌ నాయకుడి దారుణ హత్య

ట్రాఫిక్‌ హోంగార్డ్‌ను రోడ్డుపై పరిగెత్తించి..

కువైట్‌లో నడిపల్లి యువకుడి మృతి

ముసుగు దొంగలొచ్చారు.. తస్మాత్‌ జాగ్రత్త.!

దొంగలు రైల్లో.. పోలీసులు విమానంలో..

ఉద్యోగం పేరుతో మహిళను దుబాయ్‌కి పంపి..

అడవిలో ప్రేమజంట బలవన్మరణం

యువకుడితో ఇద్దరు యువతుల పరారీ!

టిక్‌టాక్‌ వద్దన్నందుకు మనస్తాపంతో..

గురుకుల విద్యార్థి ప్రాణం తీసిన ఈత సరదా

తల్లి దుర్భుద్ది.. తలలు పట్టుకున్న పోలీసులు

మంచినీళ్లు అడిగి అత్యాచారయత్నం

ప్రేమ పేరుతో అమానుషం

రాఘవ లారెన్స్‌ పేరుతో మోసం

మేనమామ వేధిస్తున్నాడు.. నటి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హ్యాట్రిక్‌కి రెడీ

అందుకే నటించేందుకు ఒప్పుకున్నా

ఫుల్‌ జోష్‌

భవ్య బ్యానర్‌లో...

నాలుగు దశలు.. నాలుగు గెటప్పులు

భయపెట్టే ఆవిరి