వ్యభిచారం చేయమని వేధిస్తున్న తండ్రి అరెస్టు!

27 Aug, 2019 10:27 IST|Sakshi

సాక్షి, చిలకలూరిపేట: పెంపుడు కుమార్తెను వ్యభిచారం చేయమని వేధిస్తున్న తండ్రిని పట్టణ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అర్బన్‌ సీఐ వి.సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... గుంటూరులో నివాసం ఉండే ప్రత్తిపాడు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన మిట్టనోసుల ప్రభుదాసు ఎలియాస్‌ వీరారావు ఒక కుమార్తెను పెంచుకున్నాడు. ఆమె చేత 13 సంవత్సరాల వయస్సు నుంచే బలవంతంగా వ్యభిచారం చేయించేవాడు. ఆమెకు వివాహం జరిగాక కూడా వ్యభిచారం చేయిస్తుండటంతో భర్త వదలివేశాడు. దీంతో ఆమె చిలకలూరిపేట పట్టణంలో తన కుమార్తెతో కలసి జీవనం కొనసాగిస్తోంది. ఇది తెలిసి వీరారావు తిరిగి ఆమెను వ్యభిచారం చేయాల్సిందిగా కొట్టి గాయపరచటంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయమై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.    

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా