కర్నూల్‌లో దారుణం.. కన్నకూతురిపై దాడి

5 Oct, 2018 21:53 IST|Sakshi

సాక్షి, కర్నూల్‌ : ఆదోనిలో దారుణం చోటుచేసుకుంది. కన్నకూతురిపై కత్తితో దాడిచేశాడో తండ్రి. కర్నూలు జిల్లా ఆదోని శంకర్‌ నగర్‌కు చెందిన అంజలి అనే యువతిపై ఆమె తండ్రి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో యువతి తీవ్రంగా గాయపడింది. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రేమ వ్యవహారమే దాడికి కారణమని స్థానికులు అంటున్నారు. దాడి అనంతరం నిందితుడు అక్కడినుంచి పరారయ్యాడు.  ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది. 

మరిన్ని వార్తలు