భార్య మృతిని తట్టుకోలేక..

3 Aug, 2019 08:08 IST|Sakshi
భారతి, కార్తికేయన్, కుమారుడు సభా (ఫైల్‌)

కుమారుడిని హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి

మదురైలో సంఘటన

చెన్నై , అన్నానగర్‌ : భార్య మృతిచెందిన కొద్దిసేపటికే కుమారుడిని హత్య చేసి తండ్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మదురైలో గురువారం జరిగింది. వివరాలు.. మదురై కోవిల్‌ బాప్పాక్కుడి ప్రాంతానికి చెందిన కార్తికేయన్‌ (42) పాత ఇనుప వస్తువుల వ్యాపారం చేసేవాడు. ఇతను పెరియార్‌ బస్టాండ్‌ సమీపంలోని ఓ హోటల్‌ యజమాని కుమార్తె భారతి (37)ని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వివాహానికి ఇద్దరి కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. అయినా పెళ్లి చేసుకోవడంతో ఇరు కుటుంబాలు వీరితో మాట్లాడడం లేదు. కార్తికేయన్‌ భార్యతో కలిసి ఎస్‌.ఎస్‌.కాలనీలోని అపార్టుమెంట్‌లో నివసిస్తున్నాడు. వీరికి కుమారుడు సభా (13) ఉన్నాడు.

ఈ క్రమంలో భారతికి అనారోగ్యం చేసింది. చేతులు, కాళ్లు పనిచేయక మంచానికే పరిమితమైంది. ఆమెను వివిధ ఆస్పత్రులకు తీసుకెళ్లినా వ్యాధి నయం కాలేదు. ఈ క్రమంలో గురువారం అపార్ట్‌మెంట్‌ సెక్యూరిటీ ఆసైతంబి, కట్టణమ్‌ వసూలు చేయడానికి కార్తికేయన్‌ ఇంటికి వెళ్లాడు. చాలా సేపు తలుపులు తట్టినా తెరవలేదు. దీంతో సాయంత్రం మరోసారి ఇంటికి వెళ్లి తలుపులు తట్టినా తెరవలేదు. దీంతో అనుమానం వచ్చి లోపకలికి వెళ్లి చూశాడు. కార్తికేయన్‌ ఫ్యాన్‌కి శవంగా వేలాడుతూ కనిపించాడు. భారతి, సభా మృతి చెంది ఉండడం చూసి దిగ్భ్రాంతి చెందాడు. వెంటనే ఈ ఘటన గురించి ఎస్‌.ఎస్‌.కాలనీ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసు జాయింట్‌ కమిషనర్‌ శశిమోహన్, సహాయ కమిషనర్‌ వెట్రిసెల్వన్, ఇన్‌స్పెక్టర్‌ అరుణాచలం, పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి విచారణ చేశారు. అక్కడ కార్తికేయన్‌ రాసిన లేఖ చిక్కింది. ఇందులో ‘నా భార్య వేకువజామున మృతి చెందింది. భార్య లేని లోకంలో జీవించడానికి నచ్చడం లేదు. నా కుమారుడు వికలాంగుడు కావడంతో అతన్ని చూసుకోలేని పరిస్థితి. కనుక నేను, నా కుమారుడు చనిపోతున్నాం’ అని రాసి ఉంది. అనంతరం పోలీసులు జరిపిన విచారణలో భార్య మృతి చెందిన కొద్దిసేపట్లో కార్తికేయన్‌ కుమారుడిని దిండుతో ముఖంపై నొక్కి హత్య చేశాడని తెలిసింది. తరువాత అతను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. ఈ ఘటన గురించి పోలీసులు విచారణ చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మహిళ వద్ద చైన్‌ స్నాచింగ్‌

విద్యార్థిని కిడ్నాప్, హత్య

పెళ్లైన 20 రోజులకే భర్తను సజీవదహనం చేసిన భార్య

ఓలా క్యాబ్‌ అంటూ ప్రైవేటుకారులో...

తల్లి అస్థికలు నిమజ్జనం చేస్తుండగా..

యువతిని ర్యాగింగ్‌ పేరుతో వేధించారని: వైరల్‌

ఘరానా దొంగలు.. ఏసీలు రిపేరు చేస్తామంటూ..

జూదంలో భార్యను పణంగా పెట్టి..

80 మంది విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం

జిల్లాలో సారా పరవళ్లు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కిడ్నాప్‌ కలకలం

వైద్యుల నిర్లక్ష్యానికి శిశువు మృతి

రూ.లక్ష కోసం ట్రిపుల్‌ తలాక్‌.. కేసు నమోదు..!

అప్పు తీర్చలేకే హత్య 

అత్తపై అల్లుడి లైంగిక దాడి

ప్రాణం తీసిన సరదా పందెం 

ఉద్యోగం కోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు..

భార్యను కడతేర్చిన భర్త

అమ్మా ! నాకెందుకు ఈ శిక్ష.. 

వైఎస్సార్‌సీపీ నేతపై హత్యాయత్నం

భరించలేక.. బాదేశారు!

కాళ్లపారాణి ఆరకముందే నూరేళ్లు

చదువుతూనే గంజాయి దందా..

నిఘా నిద్ర.. జూదం దర్జా! 

ఉపాధ్యాయ వృత్తికే కళంకం

మనోహరన్‌కు రెండు ఉరి, యావజ్జీవ శిక్షలు

రూ. 25 కోట్ల అధర్మ ఆదాయం!

హలో ఎస్‌బీఐ నుంచి మాట్లాడుతున్నా..

మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య

కుమార్తెను కడతేర్చి తల్లి ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ద్విపాత్రాభినయం

నటుడు విశాల్‌కు అరెస్ట్‌ వారెంట్‌

అలా చేశాకే అవకాశమిచ్చారు!

గుణ అనే పిలుస్తారు

తుగ్లక్‌ దర్బార్‌లోకి ఎంట్రీ

వసూళ్ల వర్షం పడుతోంది