కూతురిపై తండ్రి లైంగిక దాడి

16 Jan, 2020 17:45 IST|Sakshi

సాక్షి, చిత్తూరు: సభ్య సమాజం తలదించుకునే విధంగా మానవత్వాన్ని మంటగలుపుతూ ఓ తండ్రి.. కన్న కూతురి పైనే లైంగిక దాడికి ఒడిగట్టిన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం దామరకుప్పం గ్రామానికి చెందిన కృష్ణయ్యకు ఇద్దరు భార్యలు. రెండో భార్యకు కలిగిన 13 ఏళ్ల కూతురు బీసీ హాస్టల్‌లో చదువుతూ..సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంటికి వచ్చింది. ఆ సమయంలో కన్నకూతురిపై తండ్రి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలిని పుత్తూరు ఆసుపత్రికి తరలించారు. క్రిష్ణయ్యపై ‘దిశ’ చట్టం కింద కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

>
మరిన్ని వార్తలు