కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన తండ్రి అరెస్టు

31 Oct, 2018 09:25 IST|Sakshi
మహ్మద్‌ ఇర్షాద్‌

యాకుత్‌పురా: కన్న కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన ఓ తండ్రిని రెయిన్‌బజార్‌ పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు.ఇన్‌స్పెక్టర్‌ పి. అంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం... యాకుత్‌పురా చావునీ నాదే అలీబేగ్‌ ప్రాంతానికి చెందిన  మహ్మద్‌ ఇర్షాద్‌ (38) కూతురు (17) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది.

కాగా గత మూడు నెలల క్రితం కన్న కూతురితో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఇంట్లో లైంగిక దాడికి పాల్పడ్డారు. జరిగిన సంఘటనపై బాధితురాలు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు  మహ్మద్‌ ఇర్షాద్‌ను మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. 

మరిన్ని వార్తలు