నగరంలో మృగాళ్లు

22 Jun, 2019 08:54 IST|Sakshi
పోలీసుల అదుపులో ఎల్లయ్య

కుమార్తెపై లైంగికదాడికి పాల్పడిన తండ్రి అరెస్ట్‌

చిన్నారిపై లైంగిక  దాడికి వృద్ధుడి యత్నం

హైదరాబాద్‌: మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి కుమార్తెపై లైంగికదాడికి పాల్పడిన తండ్రిని శుక్ర వారం నేరేడ్‌మెట్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివ రాల్లోకి వెళితే..నేరేడ్‌మెట్‌ పరిధిలో నివాసం ఉం టున్న  రాజేష్‌ ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కొన్నాళ్లుగా అతను మద్యానికి బానిసగా మారా డు. వారం రోజుల క్రితం మద్యం మత్తులో ఇంటి వచ్చిన అతను విచక్షణ కోల్పోయి ఐదేళ్ల కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనిని గుర్తించిన అతడి భార్య నేరేడ్‌మెట్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నిందితుడిని శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

మామిడి పండు ఇస్తానని..
జగద్గిరిగుట్ట రిక్షాపుల్లర్స్‌ కాలనీకి చెందిన ఎల్లయ్య (60) తన ఇంటి సమీపంలో ఉండే ఐదేళ్ల చిన్నారిని మామిడి పండు ఇప్పిస్తానని మభ్యపెట్టి ఇంట్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించాడు. దీంతో చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి వచ్చి ఆమెను రక్షించిన సంఘటన గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు ఎల్లయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు