కీచక తండ్రికి కటకటాలు

24 Aug, 2019 08:35 IST|Sakshi

కన్న కూతురిపై లైంగిక దాడి

నిందితుడికి ఐదేళ్లు జైలు శిక్ష  

రంగారెడ్డిజిల్లాకోర్టులు: కన్న కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.5వేలు జరిమానా విధిస్తూ సైబరాబాద్‌ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి శుక్రవారం తీర్పు చెప్పారు. అదనపు ప్రాసిక్యూషన్‌ రాజిరెడ్డి  కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అల్వాల్‌ అంబేద్కర్‌ కాలనీకి చెందిన లింగం కుమార్‌ భార్య మృతి చెందడంతో కుమార్తె, కుమారుడితో కలిసి ఉండేవాడు. లింగంకుమార్‌ సెంట్రింగ్‌ పనులు చేస్తూ కుటుంబాన్ని  5వ తరగతి చదివే బాలికపై తరచూ లైంగిక దాడికి పాల్పడేవాడు. బాధితురాలు ఈ విషయాన్ని తన నాన్నమ్మ దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె మనవరాలిని తన   ఇంటికి తీసుకెళ్లింది. ఆ తర్వాత కొన్నాళ్లకు లింగం కుమార్‌  రెండో పెళ్లి చేసుకున్నాడు.

అనంతరం కుమార్తెను తన ఇంటికి తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కూడా కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడటంతో బాధితురాలు 2014 జులై 12న అల్వాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని  అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేయడంతో సాక్ష్యాధారాలు పరిశీలించిన న్యాయమూర్తి నర్సింగ్‌రావు  లింగంకుమార్‌కు ఐదేళ్ల జైలు శిక్ష, రూ 5వేల జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పారు. అనంతరం జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నుంచి  రూ .1లక్షను బాధితురాలికి అందజేయాలని ఆదేశించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా