కుమార్తెపై లైంగిక దాడి.. ఏడేళ్ల జైలు

1 Oct, 2019 11:22 IST|Sakshi
నిందితుడు మన్నె డేవిడ్‌

కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడిన తండ్రికి ఏడేళ్ల జైలు

బంజారాహిల్స్‌: మద్యం మత్తులో కన్న కూతురిపైనే లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి నాంపల్లి మూడో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ సోమవారం తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెలితే .. బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 10, గురుబ్రహ్మ నగర్‌కు మన్నె డేవిడ్‌ కూలీగా పనిచేసేవాడు. మద్యానికి బానిసైన అతను తరచూ భార్య, కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు. 2017 జూన్‌ 4న మధ్యాహ్నం మద్యం మత్తులో ఇంటికి వచ్చి డేవిడ్‌ ఇంట్లో ఒంటరిగా ఉన్న కుమార్తెపై (15)ను లైంగికదాడికి పాల్పడ్డాడు.

ఆమె తండ్రి అతడి బారినుంచి తప్పించుకునేందుకు యత్నించగా  కాళ్లు, చేతులు కట్టేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలు ఈ విషయాన్ని తల్లి దృష్టికి తీసుకెళ్లడమేగాక గతంలోనూ తనపై లైంగికదాడికి పాల్పడినట్లు తెలిపింది. దీంతో ఆమె బాధితురాలితో కలిసి బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదే రోజు డేవిడ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్సై భరత్‌భూషన్‌  పక్కా ఆధారాలతో కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి సోమవారం తీర్పు చెప్పారు. బంజారాహిల్స్‌ ఇనిస్పెక్టర్‌ కళింగరావు నేతృత్వంలో కేసు దర్యాప్తు చేశారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

లాక్‌డౌన్‌ వేళ జమ్మూ కశ్మీర్‌లో దారుణం

పురుగుల మందుతో బోండాలు.. ఇద్దరి మృతి

డాక్టర్‌ సుధాకర్‌పై సస్పెన్షన్‌ వేటు

లాక్‌డౌన్‌లో.. లిక్కర్‌ దందా..!

మనస్తాపంతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

సినిమా

కరోనాతో హాలీవుడ్‌ నటుడు మృతి

ఫిజికల్‌ డిస్టెన్స్‌.. సెల్ఫీ

నటి కుమారుడి ఆత్మహత్యాయత్నం?

కరోనా విరాళం

నిర్మాత కరీమ్‌కు కరోనా

డ్రైవర్‌ పుష్పరాజ్‌