కన్న కూతురిపై లైంగిక దాడి

30 Jul, 2019 10:22 IST|Sakshi

గర్భం దాల్చిన బాలిక

విషయాన్ని దాచిన కుటుంబ సభ్యులు

సాక్షి, కావలి: కన్న కూతురిపై లైంగిక దాడికి పాల్పడి గర్భవతిని చేశాడు ఓ కామాంధ తండ్రి. పోలీసుల కథనం మేరకు జలదంకి మండలం బ్రాహ్మణక్రాక పంచాయతీలోని హనుమకొండపాళెం గ్రామానికి చెందిన కర్ర బాలరాజు బేల్దారి పనులు చేస్తుంటాడు. అతడికి భార్య, కుమారుడు ఉన్నారు.  భార్య అనారోగ్యానికి గురి కావడంతో మరో మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఒక అబ్బాయి, అమ్మాయి సంతానం కలిగారు. రెండో భార్య సంతానంలోని ఓ బాలిక పదో తరగతి చదువుతోంది. ఆ బాలికపై గత మే నెల నుంచి బలవంతంగా కామవాంఛను తీర్చుకుంటున్నాడు. ఈ విషయాన్ని బాలిక కుటుంబ సభ్యులు దాచిపెట్టారు. బాలిక అస్వస్థతకు గురికావడంతో సోమవారం కావలిలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు వైద్య పరీక్షలు చేసి ఆరు వారాలు గర్భిణి అని నిర్ధారించారు.

విషయం పోలీసులకు తెలియడంతో కావలి డీఎస్పీ డి.ప్రసాద్‌ నేతృత్వంలోని పోలీసుల బృందం ఆస్పత్రికి చేరుకొంది.  అప్పటి వరకు ఆస్పత్రిలోనే ఉన్న బాలిక తండ్రి బాలరాజు అక్కడ నుంచి పారిపోయాడు. బాలిక కుటుంబ సభ్యులను విచారించగా, బహిర్భూమికి వెళ్లినప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారని  పొంతన లేని సమాధానాలు చెప్పసాగారు. దీంతో పోలీసులు బాలిక తండ్రి గురించి ఆరా తీశారు. అతను అక్కడి నుంచి జారుకున్నట్లు నిర్ధారించుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో బాలిక కుటుంబీకులను విచారించడంతో తండ్రే బాలికను గర్భవతిని చేయడంతో, అబార్షన్‌ చేయించడానికి ఆస్పత్రికి వచ్చినట్లు చెప్పారు. బాలరాజు చెన్నైలో బేల్దారి పనులు చేస్తున్నందున అక్కడికి పారిపోయి ఉంటాడని పోలీసులు గాలిస్తున్నారు.

   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వలస జీవుల విషాద గీతిక

భవనంపై నుంచి దూకిన కానిస్టేబుల్‌.. విషాదం

ఎట్టకేలకు పోలీసుకు చిక్కిన రవిశేఖర్‌

నకిలీ మావోయిస్టుల ముఠా అరెస్ట్‌

అనుమానాస్పద స్థితిలో ఫుడ్‌ డెలివరీ బాయ్‌ మృతి

గోరింటాడ యువకుడు లాత్వియాలో మృతి

న్యూజిలాండ్‌ పంపిస్తామని చెప్పి లక్షలు దోచుకున్నారు

వైద్యవిద్యార్థి ఆత్మహత్య!

రూంకి రమ్మనందుకు యువతి ఆత్మహత్యాయత్నం

ఏ తల్లి నిను కన్నదో..

మృతదేహాన్ని ముసిరిన ఈగలు, చీమలు

గ్రౌండ్‌మన్‌ను చంపేశారు..!

మౌనపోరాటంతో అనుకున్నది సాధించింది

ఆస్తి దక్కలేదని వివాహిత ఆత్మహత్య

బాలుడి హత్య.. నరబలిగా అనుమానం

తల్లి కోసం హత్యలు..!

సోనీ ఆచూకి లభ్యం

కోటిస్తేనే కనికరించారు!

ఉరిశిక్ష అమలులో జాప్యం, సంచలన తీర్పు

డమ్మీ గన్‌తో పోలీసులనే బెదిరించి..!

‘ఉన్నావ్‌’ కేసులో ట్విస్ట్‌; బీజేపీ ఎమ్మెల్యేపై కేసు

ఫిలింనగర్‌లో దారుణం..

హయత్‌నగర్ కిడ్నాప్ కేసులో వీడని మిస్టరీ!

కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నాం :డీసీపీ

వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి!

వేకువనే విషాదం

వానతో పాటు వస్తాడు... ఊడ్చుకుపోతాడు

వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు ఆత్మహత్య

వ్యభిచారం గుట్టురట్టు

కాగజ్‌నగర్‌లో 144 సెక్షన్‌ 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

శంకర్‌ దర్శకత్వంలో ఆ ఇద్దరు

ఎంత బాధ పడ్డానో మాటల్లో చెప్పలేను..

కాజల్‌.. సవాల్‌

అఖిల్‌ సరసన?

తగ్గుతూ.. పెరుగుతూ...

సంపూ రికార్డ్‌