అగ్ని ప్రమాదంలో పది షాపుల దగ్ధం

21 Dec, 2018 12:15 IST|Sakshi
కొండాలమ్మచింత సెంటర్‌లో అగ్ని ప్రమాదంలో తగలబడుతున్న షాపులు

రూ.10 లక్షల ఆస్తినష్టం

తూర్పుగోదావరి, పాశర్లపూడి (మామిడికుదురు): పాశర్లపూడి కొండాలమ్మ చింత సెంటర్‌లో గురువారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో పది షాపులు దగ్ధమయ్యాయి. సుమారు రూ.పది లక్షల ఆస్తి నష్టం ఉంటుందని ప్రాథమిక అంచనా వేశారు. పొయ్యి నుంచి లేచిన నిప్పురవ్వల వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఓఎన్‌జీసీకి చెందిన ఫైరింజన్‌తో పాటు రాజోలు, అమలాపురం అగ్ని మాపక కేంద్రాలకు చెందిన ఫైరింజన్లు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి.

గుండాబత్తుల ఆంజనేయులు, ఉలిశెట్టి మంగాదేవి, గుండాబత్తుల వెంకటరమణ, గుండాబత్తుల సూర్యనారాయణల షాపులు, నివాసగృహాలతో పాటు, కొమ్ముల కోటేశ్వరరావు, ఆకుల వీరరాఘవులు, యర్రంశెట్టి కొండలరావు, బొరుసు వెంకటేశ్వరరావు, పి.గోపాలరావు, బోణం వెంకన్న, కడలి సత్యనారాయణల చెందిన షాపులు ఈ ప్రమాదంలో పూర్తిగా కాలిపోయాయి. రెక్కాడితే కానీ డొక్కాడని బడుగు జీవుల షాపులు ప్రమాదంలో పూర్తిగా కాలిపోవడంతో వారు తీవ్రంగా రోధిస్తున్నారు. బాధితులు కట్టుబట్టలతో వీధిన పడ్డారు. వైఎస్సార్‌ సీపీ పి.గన్నవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ కొండేటి చిట్టిబాబు, వైఎస్సార్‌ సీపీ సేవాదళ్‌ విభాగం రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల కొండలరావు, నాయకులు మొల్లేటి త్రిమూర్తులు, యూవీవీ సత్యనారాయణ, తోలేటి ఆదినారాయణమూర్తి, బొరుసు చిట్టిబాబు, పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి తదితరులు బాధితులను పరామర్శించి వారిని ఓదార్చారు. బా«ధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు