షోరూంలో అగ్ని ప్రమాదం : నాలుగు కార్లు దగ్ధం

30 Aug, 2019 21:41 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : నగరంలోని ఎంవీపీ డబుల్‌ రోడ్డులో ప్రముఖ కార్ల కంపెనీ 'హుందాయ్' షోరూంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నాలుగు కార్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ షోరూంలో విక్రయించే కార్లతో పాటు సర్వీసింగ్‌కు వచ్చిన కార్లు కూడా ఉన్నాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడ్డాయి. దాదాపు అరగంట శ్రమించి అగ్నిమాపక సిబ్బంది  మంటలను అదుపు చేసింది. నష్ట తీవ్రత లక్షల్లో ఉండొచ్చని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు