ఐటీఐలో అగ్నిప్రమాదం 

4 Aug, 2019 11:47 IST|Sakshi
 రాజరాజేశ్వరి ఐటీఐ కళాశాలలో ఎగసిపడుతున్న మంటలు, భయాందోళనతో బయటకు వచ్చిన విద్యార్థులు

అసలే శిథిలావస్థలో ఉన్న భవనం. అగ్నిమాపక అనుమతులు లేకుండానే ఏళ్ల తరబడిగా ఆ ఐటీఐను అక్కడ నిర్వహిస్తున్నారు. శనివారం విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా భారీ పేలుడు. అగ్ని ప్రమాదం సంభవించడంతో భయాందోళనతో విద్యార్థులు బయటకు పరుగులు తీసిన ఘటన.. పెద్దాపురం రాజరాజేశ్వరి ఐటీఐ కళాశాలలో చోటు చేసుకుంది.  

సాక్షి, పెద్దాపురం(తూర్పుగోదావరి) : పట్టణ శివారు పాండవుల మెట్ట సమీపంలో రాజరాజేశ్వరి ఐటీఐ కళాశాలలో పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. కళాశాల గ్రౌండ్‌ ఫ్లోర్‌లో విద్యుత్తు షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఒక్కసారిగా భారీ పేలుడుతో నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. ఫస్ట్‌ ఫ్లోర్‌లో పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఉలిక్కిపడి పరీక్ష హాలు నుంచి బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బందికి వెంటనే సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపకాధికారి బంగారు ఏసుబాబు ఆధ్వర్యంలో సిబ్బంది మంటలను అదుపు చేసింది. ఫైర్‌ సేఫ్టీ అనుమతి తీసుకోకపోవడంతో కళాశాల యాజమాన్యంపై అగ్నిమాపక అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నిసార్లు చెప్పిన అనుమతులు తీసుకోలేదన్నారు. పెను ప్రమాదం తప్పింది కాబట్టి సరిపోయిందని, లేకుంటే సుమారు 200 మంది విద్యార్థుల పరిస్థితి ఏమిటని తల్లిదండ్రులు వాపోయారు. కళాశాల నిర్వహణ తీరుపై అధికారులు దృష్టి సారించకపోవడం పట్ల స్థానికులు మండిపడుతున్నారు. కళాశాల యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అగ్నిమాపకాధికారి ఏసుబాబు మాట్లాడుతూ సకాలంలో మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. ఫైర్‌ సేఫ్టీకి ఏర్పాట్లు చేసుకోవాలని కళాశాల యాజమాన్యానికి వివరించామని తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

భార్యను హత్య చేసి.. ఇంటికి తాళం వేసి..

బిస్కెట్ల గోదాములో అగ్నిప్రమాదం

తుపాన్‌ మింగేసింది

ఒక్కడు.. అంతులేని నేరాలు

కలెక్టర్‌పై ట్విటర్‌లో అసభ్యకర పోస్టులు

మత్తు వదిలించేస్తారు!

ఆమెతో చాటింగ్‌ చేసి అంతలోనే..

దండుపాళ్యం బ్యాచ్‌లో ఇద్దరి అరెస్టు

కాల్పుల కలకలం.. 20 మంది మృతి

ఆటోలో తిరుగుతూ దొంగతనాలు చేస్తారు

ఎంత పని చేశావు దేవుడా!

పదహారేళ్లకే నిండునూరేళ్లు.. 

కారుతో ఢీ కొట్టిన ఐఏఎస్‌

రాష్ట్రానికో వేషం.. భారీగా మోసం

అలా రూ. 2 కోట్లు కొట్టేశాడు

కాలేజీ విద్యార్థిని హత్య ; కోర్టు సంచలన తీర్పు.!

మీడియా ముందుకు మోస్ట్‌ వాంటెడ్‌ కిడ్నాపర్‌

లాయర్‌ ఫీజు ఇచ్చేందుకు చోరీలు

దారుణం: పీడకలగా మారిన పుట్టినరోజు

టీడీపీ నేత యరపతినేనిపై కేసు నమోదు

కుక్కకు గురిపెడితే.. మహిళ చనిపోయింది!

మద్యంసేవించి ఐఏఎస్‌ డ్రైవింగ్‌.. జర్నలిస్ట్‌ మృతి

తండ్రి మందలించాడని కుమార్తె ఆత్మహత్య

బ్యుటీషియన్‌ ఆత్మహత్య

ఏడో తరగతి నుంచే చోరీల బాట

నకిలీ సర్టిఫికెట్ల గుట్టురట్టు

ప్రేమపెళ్లి; మరణంలోనూ వీడని బంధం

నర్సింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య

ఇంట్లో అందర్నీ చంపేసి.. తాను కూడా

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రైఫిల్‌ షూట్‌ పోటీల్లో ఫైనల్‌కు అజిత్‌

సింగిల్‌ టేక్‌లో చేయలేను..!

రష్మిక కోరికేంటో తెలుసా?

ఆర్టిస్ట్‌ బ్రావో!

యాక్షన్‌ అవార్డ్స్‌

శత్రువు లేని యుద్ధం