మంచిర్యాలలో భారీ అగ్ని ప్రమాదం

29 Aug, 2019 10:38 IST|Sakshi
మంటలార్పుతున్న ఫైర్‌ సిబ్బంది, అగ్ని ప్రమాదంలో దగ్దమైన నగదు  

 వంటగ్యాస్‌ లీకేజీతో చెలరేగిన మంటలు

 రూ. 6 లక్షల వరకు ఆస్తి నష్టం

రూ. 40 వేల నగదు దగ్దం

సాక్షి, మంచిర్యాల : జిల్లా కేంద్రంలోని ముఖరాం చౌరస్తా వద్ద గల శ్రీనివాస్‌ ఇంట్లో వంట గ్యాస్‌ లీకవడంతో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీనివాస్‌ భార్య ఇంట్లో వంట చేస్తుండగా ఒక్కసారిగా సిలిండర్‌ నుంచి గ్యాస్‌ లీకయి మంటలు చలరేగాయి. ఇది గమనించిన ఇంట్లో ఉన్న వారు బయటకు పరుగులు తీశారు. 101 ఫైర్‌ అధికారులకు కాల్‌ చేయడంతో సమయస్ఫూర్తితో స్పందించి మంటలు ఆర్పివేశారు. ప్రమాదంలో ఇంట్లో ఉన్న సామగ్రి పూర్తిగా కాలిపోయింది. బీరువాలో ఉన్న రూ. 40 వేల నగదు కాలిబూడిదైంది. సుమారు. రూ. 6 లక్షల విలువ గల ఇంటి సామగ్రి, ఇతర వస్తువులు మంటల్లో కాలిబూడిదయ్యాయి. 


శ్రీనివాస్‌ ఇంటి చుట్టూ వ్యాపార దుకాణాలు ఉన్నాయి. ఒక వేల మంటలు బయటకు వెళ్లినట్‌లైతే జిల్లా కేంద్రంలో భయానక వాతావరణం సంతరించుకునేది. అగ్నిమాపక శాఖ అధికారులు చాకచక్యంగా వ్యవహరించి మంటలు ఆర్పివేశారు. లేకపోతే జిల్లా కేంద్రంలో సుమారు కోటి రూపాయాల అస్తినష్టం జరిగేదని ఫైర్‌ అధికారి దేవేందర్‌ తెలిపారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు