రాజన్న నిత్యాన్నదాన సత్రంలో మంటలు 

5 Apr, 2018 14:43 IST|Sakshi
సత్రంలో విచారణ జరుపుతున్న ఏఈవో, ఎస్పీఎఫ్‌ అధికారులు

 తప్పిన పెను ప్రమాదంఊపిరి పీల్చుకున్న  అధికారులు

వేములవాడ: వేములవాడ రాజన్న ని త్యాన్నదాన సత్రం లో బుధవారం ఉద యం బాయిలర్‌ ము ట్టించే క్రమంలో మంటలు చెలరేగా యి. వెంటనే తేరుకు న్న సిబ్బంది మంటలు ఆర్పేశారు. దీం తో ఎర్రం మల్లేశం అనే వ్యక్తి తలవెం ట్రుకలు కాలిపోయాయి. స్వల్పగాయాలతో బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

విషయం తెలుసుకున్న ఏఈవో దేవేందర్, ఎస్పీఎఫ్‌ హెడ్‌కానిస్టేబుల్‌ లచ్చన్న, ఎస్‌బీ పోలీసులు, సత్రానికి చేరుకుని విచారణ చేపట్టారు. జాగ్రత్తలు పాటించాలనీ, నిబంధనల మేరకు సిబ్బందిని అనుమతించాలని ఏఈవో సత్రం ఇన్‌చార్జీలను ఆదేశించారు. టౌన్‌ సీఐ ఎన్‌. వెంకటస్వామి ఘటనపై ఆరా తీశారు. 
అధికారుల సీరియస్‌..
రాజన్న ఆలయంలోని పలు విభాగాల్లో ప్రైవేట్‌ వ్యక్తుల ప్రమేయం రోజురోజుకు పెరిగిపోతుండటంతో ఆలయ ఈవో రా జేశ్వర్‌ సీరియస్‌గా వ్యవహరించినట్లు తెలిసింది. మంటలు చెలరేగిన సమయంలో గాయపడిన మల్లేశంకు ఆలయానికి ఎలాంటి సంబంధం లేదని.. ప్రైవేట్‌ వ్యక్తులను ఎందుకు అనుమతి స్తున్నారని సిబ్బందిని మందలించారు. కాగా సత్రం ఇన్‌చార్జి రాములుకు మ ల్లేశం సమీప బంధువు కావడంతో అ ప్పుడప్పుడు తనకు సాయంగా ఉంటా డని రాములు పేర్కొనడం గమనార్హం.    

మరిన్ని వార్తలు