ఎస్‌బీఐలో అగ్ని ప్రమాదం

28 May, 2019 18:35 IST|Sakshi

చండీగఢ్‌ : నగరంలోని సెక్టార్‌ 17లోని భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) ప్రధాన శాఖలో మంగళవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో బ్యాంకులో 22 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదన్నారు. ఉద్యోగులందరిని సురక్షితంగా బయటకు చేర్చినట్లు పేర్కొన్నారు. కానీ దట్టమైన పొగ అలుముకోవడంతో కొందరికి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయన్నారు. ప్రస్తుతం వారిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని.. మంటలను అదుపులోకి తీసుకొచ్చారని తెలిపారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం సంభవించినట్లు అధికారులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు