సాఫ్ట్‌వేర్‌ క్రిమినల్‌ లాయర్‌ జైలుకు..

9 Sep, 2018 03:46 IST|Sakshi

బెంగళూరు: చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు సకల ప్రయత్నాలుచేశాడు. అందుకోసం సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ జాబ్‌ వదిలేసి లా చదివి క్రిమినల్‌ లాయర్‌గా మారాడు. ఏంచేసినా ఫలితం శూన్యం. దీంతో పదేళ్ల కిందట కేసులో శిక్ష పడింది. కర్ణాటకలోని బాగల్‌కోట్‌ జిల్లాకు చెందిన శివప్రసాద్‌ సజ్జన్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీ. ఓ మహిళకు అశ్లీల ఈ–మెయిల్స్‌ పంపుతూ, ఆమె ఫొటోలను మార్ఫింగ్‌ చేసి అందరికీ సర్క్యులేట్‌ చేస్తూ  వేధించాడు. బాధిత మహిళ ఫిర్యాదుచేయంతో సజ్జన్‌ను 2008లో పోలీసులు అరెస్టు చేశారు. బెయిల్‌పై విడుదలైన సజ్జన్‌.. ఇంజనీరింగ్‌ జాబ్‌ వదిలి లా గ్రాడ్యుయేషన్‌ కోర్సు పూర్తిచేసి క్రిమినల్‌ లాయర్‌ అయ్యాడు. కేసును పొడిగించేందుకు చట్టంలోని లొసుగులను వాడాడు. తర్వాత కేసు సీఐడీకి బదిలీ అయ్యింది. తాజాగా కేసు విచారణ పూర్తయింది. సజ్జన్‌ను దోషిగా నిర్ధారించిన బెంగళూరులోని కోర్టు అతడికి రెండేళ్ల జైలు శిక్షతోపాటు రూ.25 వేల జరిమానా విధించింది.

మరిన్ని వార్తలు