వేడి నీటి పైపు పేలి అయిదుగురు మృతి

20 Jan, 2020 19:00 IST|Sakshi

మాస్కో : వేడి నీటి పైపు పేలి అయిదుగురు మరణించిన ఘటన రష్యాలో చోటు చేసుకుంది. పెర్మ్‌ నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో ఉన్న హోటల్‌లో సోమవారం సాయంత్రం వేడి నీటితో ఉన్న పైపు పేలింది. దీంతో మరుగుతున్న వేడి నీరుహోటల్‌ గదుల్లోకి రావడంతో ఓ చిన్నారితో సహా అయిదుగురు మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడగా.. వారిని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లోని ఓ మహిళ శరీరం 35 శాతం  కాలిపోయి ఆమె పరిస్థితి విషమంగా ఉండగా మిగతా ఇద్దరు పరిస్థితి సాధారణంగా ఉందని వైద్యులు తెలిపారు.

ఈ ఘటనను ఘోర ప్రమాదమని, ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని ప్రాంతీయ గవర్నర్‌ మాగ్జిమ్‌ రేషెట్నికోవ్‌ అన్నారు. అదే విధంగా వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ బృందానికి ధన్యవాదాలు తెలిపారు. కాగా సోమవారం ఉదయమే పైపు లీకేజ్‌ అవుతున్నట్లు ఓ వీడియోలో రికార్డు అయ్యింది. పేలిన పైపు 1962 నుంచి ఉపయోగిస్తున్నారని, గతంలో అనేక సార్లు విరిగిపోయినట్లు స్థానిక వార్తా సంస్థ నివేదించింది.అయితే గతంలో సంభవించిన పేలుల్లో ఎవరికీ ఎలాంటి హానీ  జరగలేదని ఈ సారి మాత్రం యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం సంభవించిదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు