'దెయ్యాలే నాతో ఆ పని చేయించాయి..'

17 Feb, 2018 12:11 IST|Sakshi
ఫ్లోరిడాలోని స్కూల్‌లో కాల్పులకు పాల్పడిన ఉన్మాది నికోలస్‌ క్రజ్‌

వాషింగ్టన్‌ : 'నా తలలో ఏవేవో అరుపులు వినిపించేవి. అవి దెయ్యాల అరుపులనుకుంటా. అవే నాకు కాల్పులు ఎలా జరపాలో చెప్పాయి' ఈ మాటలు ఫ్లోరిడా స్కూల్‌లో కాల్పులకు తెగబడిన ఉన్మాది పోలీసులకు చెప్పాడు. ఫ్లోరిడాలోని హైస్కూల్‌లో అదే స్కూల్‌లో గతంలో చదివిన నికోలస్‌ క్రజ్‌ అనే యువకుడు ఉన్మాదిగా మారి కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు స్కూల్‌ సిబ్బంది సహా 17మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు పాల్పడిన నికోలస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రస్తుతం విచారిస్తున్నారు.

ఈ నేపథ్యంలో అతడు పోలీసులకు పై విధంగా సమాధానం చెప్పాడు. తన మానసిక పరిస్థితి ఎప్పుడూ చాలా ఆందోళనగా ఉండేదని, ఎవరో తనను పిలిచినట్లుగా అనిపిస్తుండేదని, తనకు పుర్రెల్లో రకరకాల శబ్దాలు వినిపిస్తుండేవని పోలీసులకు చెప్పాడు. వాటిని తాను దెయ్యాలుగా భావిస్తున్నానని, అవే తనకు ఆదేశాలు చేశాయని ఆ క్రమంలోనే కాల్పులకు తెగబడినట్లు అతడు పోలీసులకు చిత్ర విచిత్రమైన సమాధానాలు చెబుతున్నాడు.

మరిన్ని వార్తలు