రఫికా కూతురుపైనా ఆత్యాచారం..?

29 May, 2020 07:27 IST|Sakshi

కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు

నిందితుడి ఫోన్‌లో అశ్లీల చిత్రాలు

నిద్రమాత్రలు వేసి రఫికా కూతురుపైనా ఆత్యాచారం..?

గొర్రెకుంట ఘటనపై మరిన్ని కోణాల్లో విచారణ

సంజయ్‌పై ‘పోక్సో’ చట్టం!

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: గొర్రెకుంట హత్యల ఘటన నిందితుడు సంజయ్‌కుమార్‌ యాదవ్‌పై మరిన్ని కేసులు నమోదు చేసేందుకు వరంగల్‌ పోలీసులు కీలక ఆధారాలను సేకరించినట్లు తెలిసింది. రఫీకా కూతురు(15)పైనా అఘాయిత్యానికి పాల్పడినట్లు వీరు ఆధారాలు సేకరించారు. దీంతో సంజయ్‌పై పోక్సో చట్టం కూడా ప్రయోగించే అవకాశం ఉంది. 9 మంది హత్య కేసులో నిందితుడు సంజయ్‌కుమార్‌ యాదవ్‌ అంతకు ముందు మక్సూద్‌ భార్య నిషా అక్క కూతురు రఫికను రైలు నుంచి నిడదవోలు వద్ద కిందకి తోసి హత్య చేసిన విషయం తెలిసిందే.

ఆమెకు కూతురు సిర్దాస్‌  ఖాతూన్, కుమారులు సుల్తాన్,  సాల్మన్‌ ఉన్నారు. మహ్మద్‌ మక్సూద్‌ ఆలం కుటుంబసభ్యులు మృతి చెందడం.. తల్లిని కోల్పోయి అనాథలుగా మారిన రఫిక పిల్లలు ముగ్గురికి దిక్కెవరు? అన్న చర్చ జరుగుతోంది. అయితే రఫిక అలియాస్‌ చోటీ భర్త ఏమయ్యాడు? అసలు ఆయన ఉన్నాడా? లేడా? ఆయనను కూడా సంజయ్‌కుమార్‌ యాదవ్‌ ఏమైనా చేసి ఉంటాడా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. (ఖైదీ నంబర్‌ 4414)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు