మంచు.. వాహనం ఢీకొని సైక్లిస్టు దుర్మరణం

29 Jan, 2018 09:43 IST|Sakshi

సాక్షి, చిట్యాల: మంచు కారణంగా రహదారిపై ముందు ఉన్నది ఏదీ కనిపించని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో వాహనం ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని గుండ్రంపల్లిలో జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగింది. సైకిల్‌పై వెళుతున్న యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొనగా అతను అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడిని కంకల వెంకటేశ్(30)గా గుర్తించారు.

మరిన్ని వార్తలు