పోర్న్‌ వీడియోలు చూడమని బలవంతం చేస్తూ..

12 Aug, 2018 17:40 IST|Sakshi

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. భోపాల్‌లో ఓ ప్రైవేట్ హాస్టల్‌ నిర్వాహకుడే యువతులపై అకృత్యాలకు పాల్పడ్డారు.  వివరాల్లోకి వెళ్తే.. 36 ఏళ్ల అశ్విన్ శర్మ తన ఎన్జీవో ద్వారా భోపాల్‌‌లో రెండు హాస్టళ్లను నిర్వహిస్తున్నాడు. వీటికి సాంఘిక సంక్షేమ శాఖ ఆర్థిక సాయం చేస్తోంది. కాగా అద్దె ఇంట్లో వికలాంగ యువతుల కోసం హాస్టల్ నడుపుతున్న శర్మ.. తనను రేప్ చేశాడని బధిర యువతి ఆరోపించింది. శర్మ తమను కూడా రేప్ చేశాడని ఇప్పటి వరకూ నలుగురు యువతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు.

 పోర్న్‌ వీడియోలు చూడమని బలవంతం చేస్తూనే తనపై ఆరు నెలలుగా అత్యాచారం నెరిపాడని ఆరోపించింది. ఇతర అమ్మాయిలనూ అతడు హింసించడం తాను చూశానని, వారంతా భయంతో ఇప్పటి వరకూ నోరు మెదపలేదని తెలిపింది. దీంతో హాస్టల్ డైరెక్టర్ అశ్విని శర్మను పోలీసులు  అరెస్ట్ చేశారు. అతడిపై బెదిరింపులు, తప్పుడు నిర్బంధం, అమానుషాలను నిరోధించబడే నేరాల కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

లైంగిక దాడి.. బాలిక మృతి

బాలికను గర్భిణిని చేసిన సూపరింటెండెంట్‌..

పుట్టింటికని.. పత్తా లేకుండా పోయారు..

ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

నవ దంపతుల ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

యాక్షన్‌ప్యాక్డ్‌గా ‘కవచం’ టీజర్‌

ఆకట్టుకుంటున్న ‘కేదార్‌నాథ్‌’ ట్రైలర్‌

‘ఇండియన్‌-2’ మొదలైంది..!

‘చెడు ఎక్స్‌పెక్ట్‌ చేయకపోవడం పిచ్చితనం’

‘ఎన్టీఆర్‌’ మహానాయకుడు వాయిదా పడింది!

రజనీ ‘పేట్టా’ సంక్రాంతికి రావడం లేదు!