భారీ మొత్తంలో ఫారెన్‌ కరెన్సీ పట్టివేత

18 Mar, 2018 14:39 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, చెన్నై : భారత్‌ నుంచి విదేశాలకు ఫారెన్‌ కరెన్సీని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని కస్టమ్స్‌ అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. అతని వద్ద దాదాపు కోటిన్నర విలువచేసే అరబ్‌ దేశాలకు సంబందించిన కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. 

అక్రమంగా విదేశీ నగదు తరలిస్తున్నారన్న సమాచారం అందడంతో.. దుబాయ్‌ వెళ్లే ప్రయాణికులపై నిఘా పెట్టామని, దీంతో చెన్నైకు చెందిన సయ్యద్‌ అనే వ్యక్తి వద్ద ఈమేరకు భారీ విదేశీ నగదు పట్టుబడిందని కస్టమ్స్‌ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.   ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకొని విచారణ జరుపుతున్నట్టు వెల్లడించారు. అరబ్‌ దేశాలకు చెందిన ఖతార్‌, ఒమన్‌, కువైట్‌, సౌదీ అరేబియాలకు చెందిన కరెన్సీ నోట్లు లభ్యమయ్యాయని అధికారులు పేర్కొన్నారు. 


 

మరిన్ని వార్తలు