నిందితుడెవరో తేలిపోయింది!

6 Oct, 2018 12:49 IST|Sakshi
సునీత సింగ్‌ (పాత చిత్రం)

సాక్షి, ముంబై: అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ప్యాషన్‌ డిజైనర్‌ సునీత సింగ్‌ (45) కేసులో నిందితుడెవరో తేలిపోయింది. గురువారం ఉదయం సునీత బాత్‌రూమ్‌లో శవమై కనిపించారు. ఈ ఘటన లోఖండ్‌వాలాలోని క్రాస్‌గేట్‌ బిల్డింగ్‌లో జరిగింది. ఆ సమయంలో ఫ్లాట్‌లో ఆమెతో పాటు కొడుకు లక్ష్య సింగ్‌ (22), అతనికి కాబోయే భార్య అషుప్రియ ఉన్నారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

కథ చెప్పాడు..
సునీత సింగ్‌ మరణంపై ఆమె కుమారుడు పోలీసులకు చెప్పిన వివరాలు.. బాత్‌రూమ్‌లోకి వెళ్లిన అమ్మ.. ఎంతసేపటికీ బయటికి రాలేదు. ఎంత పిలిచినా స్పందన లేదు. అనుమానం వచ్చి నేను బాత్‌రూమ్‌ డోర్‌ను బలవంతంగా తెరిచాను. అప్పటికే ఆమె కిందపడిపోయి ఉంది.. ఫ్లోర్‌పై రక్తపు మరకలు కూడా ఉన్నాయి. అది చూసి తీవ్ర ఆందోళనకు గురయ్యాను. వెంటనే దగ్గర్లో ఉన్న ఆభరణాల వ్యాపారికి విషయం చెప్పాను. అతను పోలీసులకు సమాచారమివ్వమని సూచించాడు. ఆ తర్వాత ఓ ప్రైవేటు అంబులెన్స్‌కు ఫోన్‌ చేశాను. అంతేకాకుండా ఢిల్లీలోని బంధువులకు ఈ విషయం తెలిపాను. నేను తిరిగి వచ్చేలోపే పోలీసులు అక్కడికి చేరుకున్నారని లక్ష్య వెల్లడించాడు.

పోస్టుమార్టం రిపోర్టు
పోస్టుమార్టం రిపోర్టు సునీత మృతిపై అనుమానాలు రేకెత్తించింది. తమదైన శైలిలో పోలీసులు లక్ష్యని ప్రశ్నించడంతో నిజం బయకొచ్చింది. అమ్మతో బాత్రూత్‌లో చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకుందనీ, కోపంతో ఆమెను నెట్టేయడంతో వాష్‌బేసిన్‌కి పడిపోయిందని లక్ష్య తెలిపాడు. సునీత తలకు తీవ్ర గాయాలు కావడంతో స్పృహ కోల్పోయింది. కొన ఊపిరితో ఉన్న బాధితురాలిని ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు విడిచిందని పోలీసులు వెల్లడించారు. నిందితుడిపై కేసు నమోదు చేసుకున్నామనీ, దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.

(చదవండి : బాత్‌రూమ్‌లో శవమై కనిపించిన ప్యాషన్‌ డిజైనర్‌)
 

మరిన్ని వార్తలు