స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం

18 Aug, 2019 07:42 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సామాజిక మాద్యమాల్లో అశ్లీల చిత్రాలు అప్‌లోడ్‌

చెన్నై, తిరువొత్తియూరు: స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకుని, ఆ దృశ్యాలను వీడియో తీసి సామాజిక మాద్యమాలలో పెట్టిన వ్యక్తిని పోలీసులు విచారణ చేస్తున్నారు. కుమారి జిల్లా మార్తాండం సమీపం కాప్పికాడు ప్రాంతానికి చెందిన రమేష్‌ సెకండ్‌ హ్యాండ్‌ బైకులను విక్రయిస్తుంటాడు. పంచమూర్తికి చెందిన సైనికడు ఒకరు ఇతని వద్ద ఓ బైక్‌ను కొన్నాడు. దీంతో ఆ సైనికుడికి, రమేష్‌కు పరిచయం ఏర్పడింది. రమేష్‌ తరచూ సైనికుడి ఇంటికి వచ్చే వెళ్లే సమయంలో సైనికుడి భార్యతో రమేష్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది.

సైనికుడు లేని సమయంలో రమేష్‌ అతని భార్యతో ఉల్లాసంగా వున్నట్టు తెలిసింది. ఆ సమయంలో ఆమెకు తెలియకుండా రమేష్‌ సెల్‌ఫోన్‌లో వీడియో తీశాడు. ఆ వీడియోలను చూసిన రమేష్‌ భార్య దిగ్భ్రాంతి చెంది ఆ వీడియోలను సామాజిక మాద్యమంలో పెట్టేశారు. ఆ వీడియోలను చూసిన సైనికుడు దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి రమేష్‌ వద్ద విచారణ చేస్తున్నారు. దీని గురించి సైనికుడి భార్య పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయకపోవడం వలన పోలీసులు అతన్ని హెచ్చరించి పంపించి వేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు