కుమారుడిని లండన్‌ పంపించి వస్తూ... 

20 Sep, 2019 02:42 IST|Sakshi
ఘటనా స్థలంలో కారు – డీసీఎం

రోడ్డు ప్రమాదంలో నలుగురి దుర్మరణం

లారీని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో ఢీకొట్టిన డీసీఎం

దేవరుప్పుల వద్ద ఘటన.. మానుకోటలో విషాదం

దేవరుప్పుల : జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెం సమీపాన జనగామ–సూర్యాపేట రహదారిపై గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును డీసీఎం ఢీకొట్టిన ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మహబూబాబాద్‌ జిల్లా కొత్తబజార్‌కు చెందిన పెనుగొండ సదాశివుడు కుమారుడు సాయిశంకర్‌ ఎంబీఏ చదివేందుకు లండన్‌ వెళ్తున్నాడు. సదాశివుడు, ఆయన భార్య మంజూష, ఆయన తమ్ము డు, మరదలు గణేశ్‌ (52), సుకన్య (42), ఇంకో తమ్ముడైన పూర్ణచందర్‌ భార్య శ్రీలత (35)లతో పాటు సాయిశంకర్, మిగతా తమ్ముళ్ల పిల్లలు హైదరాబాద్‌ వెళ్లారు. గురువారం తెల్లవారుజామున శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో సాయిశంకర్‌ను విమానం ఎక్కించారు. ఆ తర్వాత కొందరు హైదరాబాద్‌లోనే ఆగిపోయారు. 

కొందరు వరంగల్‌.. ఇంకొకరు మానుకోట 
శంషాబాద్‌లో సాయిశంకర్‌ను విమానం ఎక్కించాక సదాశివుడు తన తమ్ముడు గణేశ్‌ కూతురు గాయత్రి, మరో తమ్ముడు పూర్ణచందర్‌ కూతురు ప్రవీణను వరంగల్‌ కిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో దింపేందుకు కారులో బయలుదేరారు. సదాశివు డు భార్య మంజూష, గణేష్, ఆయన భార్య సుకన్య, పూర్ణచందర్‌ భార్య శ్రీలత ఇంకో కారులో దేవరుప్పుల మండల కేంద్రం మీదుగా మహబూబాబాద్‌ బయలుదేరారు. సూర్యాపేట వైపు నుంచి వస్తున్న డీసీఎం (ఏపీ 05 టీఎల్‌ 1369) డ్రైవర్‌ అతివేగంగా లారీని ఓవర్‌టేక్‌ చేసి వీరు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టాడు. దీంతో గణేష్, సుకన్య, కారు డ్రైవర్‌ నజీర్‌ అక్కడికక్కడే మృతి చెందగా శ్రీలత, మంజూష గాయపడ్డారు. క్షతగాత్రులను జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శ్రీలత మృత్యువాతపడ్డారు. మంజూషను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమా దం అనంతరం డీసీఎం డ్రైవర్‌ లొంగిపోయినట్లు సమాచారం. ఈ వార్త తెలియడంతో సాయిశంకర్‌ అబుదాబినుంచి స్వస్థలానికి బయలుదేరాడు. సాయిశంకర్‌ స్వగ్రామానికి చేరుకున్నాక అంత్యక్రియలు నిర్వహించనున్నారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసండౌన్ లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పీఎన్‌బీ స్కాం: నీరవ్‌ రిమాండ్‌ పొడిగింపు

వైఎస్సార్‌ జిల్లాలో విషాదం...

బిడ్డకు తండ్రెవరో తప్పు చెప్పినందుకు.....

దారుణం : కూతురుపై కన్నతండ్రి లైంగిక దాడి

ప్రియురాలి బంధువుల వేధింపులు తాళలేక...

అతడికి ఆ అలవాటు ఉన్నందుకే..

పోలీసుల అదుపులో మాయలేడి

కాలువలోకి దూసు​​కుపోయిన స్కూలు బస్సు..

‘పెళ్లి’ పేరుతో మహిళలకు వల

తాగి నడిపితే.. తాట తీసుడే..!

బోటు యజమాని.. జనసేనాని!

రామడుగులో విషాదఛాయలు

రాజులు వేసుకున్న ఆభరణాలని చెప్పి..

అత్తింట్లో పైశాచికం : మహిళ సజీవ దహనం

మహిళ చితిపైనే యువకుడి శవాన్ని..

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

యజమానినే ముంచేశారు..

ఆరుకు చేరిన మృతుల సంఖ్య

శివరామ్‌ విచారణకు రంగం సిద్ధం

మానవ రవాణా కేసు ఎన్‌ఐఏకు బదిలీ

చీటీల పేరుతో మోసం చేసిన జంట అరెస్ట్‌

గ్యాంగ్‌స్టర్‌ను బుక్‌ చేసిన బర్త్‌డే వీడియో

కోడెల కాల్‌ డేటాపై ఆ వార్తలు అవాస్తవం : ఏసీపీ

తల్లి పక్కన నిద్రిస్తున్న చిన్నారిని..

కళ్లలో కారం కొట్టి.. మారణాయుధాలతో దాడి

అవమానించిందని ప్రిన్సిపల్‌ను చంపేశాడు..!

'ఆసరా' పెన్షన్‌ పథకంలో భారీ గోల్‌మాల్‌!

షాకింగ్‌: పార్కుల్లో అమ్మాయిలను చూసి.. 

ప్రశాంతత కోసం ఇంట్లో చెప్పకుండా..

కొత్త స్కోడా కారు, హై స్పీడ్‌లో వెళుతూ..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

గద్దలకొండ గణేశ్‌

నీ వెంటే నేనుంటా

పల్లెటూరి పిల్లలా..

రాముడు – రావణుడు?

యమ జోరు

రౌడీకి జోడీ