డ్యామ్‌ వద్ద సెల్ఫీ.. నలుగురి మృతి

7 Oct, 2019 19:40 IST|Sakshi

కృష్ణగిరి : తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలో సెల్ఫీ సరదా నలుగురి ప్రాణాలను బలిగొంది. బర్కూర్‌కు చెందిన ప్రభుకు ఇటీవల నివేదితతో వివాహాం అయింది. వారు తమ బంధువులు కనిత, స్నేహ, యువరాణి, సంతోష్‌లతో కలిసి ఆదివారం సాయంత్రం పాంబారు డ్యామ్‌ సందర్శనకు వెళ్లారు. డ్యామ్‌ వద్ద సెల్ఫీ తీసుకునేందుకు వారంతా సిద్ధమయ్యారు. ప్రభు ఫోన్‌ పట్టుకుని ఉండగా.. మిగిలిన వారు సెల్ఫీకి స్టిల్‌ ఇస్తున్నారు. అయితే ప్రమాదవశాత్తు ప్రభు మినహా మిగిలిన వారంతా నీటిలో పడిపోయారు. దీంతో ప్రభు నీటిలోకి దూకి వారిని కాపాడే ప్రయత్నం చేశాడు. కానీ ఒక యువరాణిని మాత్రమే కాపాడగలిగాడు. మిగిలిన వారు నీటి ఉధృతిలో కొట్టుకుపోయారు. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని వారిని కాపాడేందుకు యత్నించారు. అయితే వారి ప్రయత్నాలు ఫలించలేదు. తర్వాత నీటిలో కొట్టుకుపోయిన నివేదిత, కనిష్క, స్నేహ, సంతోష్‌ మృతదేహాలను బయటకు తీశారు. ఆ తర్వాత మృతదేహాలను పోస్ట్‌మార్టమ్‌ కోసం ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసలు దర్యాప్తు చేపట్టారు. మృతులంతా దగ్గరి బంధువులే కావడంతో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వెంకటేశ్వర హెల్త్‌ కేర్‌ ఎండీ అరెస్ట్‌

వీడిన కాకినాడ జంట హత్యల కేసు మిస్టరీ!

సినిమా చూస్తూ వ్యక్తి మృతి

వ్యక్తిగత కక్షతో అసభ్యకర ఫొటోలు..

హాజీపూర్‌ కేసు నేడు కోర్టులో విచారణ

అర్ధరాత్రి తమ పని కానిచ్చేశారు

కట్టుకున్న భార్యను కత్తెరతో పొడిచి..

వాట్సాప్‌ ద్వారా దందా: భారీ సెక్స్‌ రాకెట్‌ గుట్టు రట్టు 

దొంగలొస్తారు.. జాగ్రత్త !

గ్యాస్‌ సిలిండర్‌ లీకేజీతో ఐదుగురికి తీవ్రగాయాలు

ప్రియుడే చంపేశాడు

మూత్ర విసర్జన చేస్తుండగా హత్యాయత్నం

టిక్‌టాక్‌​ జానీ దాదా కథ అలా ముగిసింది

రైతుబంధు సహాయం మరొకరి ఖాతాలోకి..

పోస్టాఫీస్‌లో సొత్తు స్వాహా..!

యువకుడిని ఢీకొన్ననటి కారు

దసరాపై ఉగ్రనీడ

వీసా రద్దు... పాకిస్తాన్‌ వెళ్లాలని ఆదేశాలు

నకిలీ ఇన్‌వాయిస్‌లతో రూ.700 కోట్ల మోసం

కూలిన శిక్షణ విమానం

అమెరికా బార్‌లో కాల్పులు

సైంటిస్ట్‌ అని అబద్ధం చెప్పి..

గ్యాంగ్‌ లీడర్‌ నాగలక్ష్మి.. రూ.50 కోట్లు స్వాహా!

14 ఏళ్లు.. 6 హత్యలు

దారుణం: ప్రియురాలు గుడ్‌బై చెప్పిందని..

ఈఎస్‌ఐ కుంభకోణం, నాగలక్ష్మి అరెస్ట్‌

సైంటిస్టుగా నమ్మించి మహిళకు బురిడీ

తన ప్రేమను ఒప్పుకోలేదని చంపేశాడు..

రెండో భర్తతో కలిసి ఆరుగుర్ని చంపేసింది..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌: గాయపడిన శివజ్యోతి

బిగ్‌బాస్‌: ఈ వారం నామినేషన్‌లో ఉండేదెవరో..

‘అల.. వైకుంఠపురములో’ నుంచి మరొకటి..

గొడ్డలి పట్టిన మహేశ్‌ బాబు

బాలయ్య లుక్‌ మామూలుగా లేదుగా..!

‘ఇద్దరి లోకం ఒకటే’ ఫస్ట్‌ లుక్‌ విడుదల