అమెజాన్‌ డెలివరీ ఏజెంట్, సూపర్‌వైజర్‌పై కేసు

16 Oct, 2019 10:30 IST|Sakshi

బంజారాహిల్స్‌: సెల్‌ఫోన్‌ను డెలివరీ ఇవ్వకుండా మోసగించిన అమేజాన్‌ డెలివరీ ఏజెంట్‌పై బాధితుడు బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే..బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 12లోని ఎమ్మెల్యే కాలనీకి చెందిన శ్రీకాంత్‌ గత నెల 28న అమేజాన్‌లో వివో యూ–10 ఫోన్‌ బుక్‌ చేశాడు. ఇందుకోసం రూ.9990 అతడి అకౌంట్‌లో నుంచి కట్‌ అయ్యాయి. గత నెల 30న ఫోన్‌ డెలివరీ చేసినట్లు అతడికి సమాచారం అందింది. అయితే 30న డెలివరీ బాయ్‌ రాకపోగా కనీసం తనకు ఫోన్‌ కూడా చేయలేదని ఐదు రోజులు ఆగినా ఫలితం లేకపోవడంతో అమేజాన్‌ కస్టమర్‌ కేర్‌ సెంటర్‌కు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారించిన అమేజాన్‌ నిర్వాహకులు పొంతనలేని సమాధానం చెప్పి చేతులెత్తేశారు. దీంతో తనకు మొబైల్‌ డెలివరీ చేయకుండానే డబ్బులు డ్రా చేసుకొని మోసగించిన ఘటనలో డెలివరీ ఏజెంట్, సూపర్‌వైజర్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా బాధితుడు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు